New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె – 11
ఆమె Premium 9 min read

ఆమె – 11

పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన క్రియన్సీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీలో అడుగుపెట్టే వయసుకు వచ్చింది. చిన్నప్పటి నుంచి తన తల్లి ప్రేమలో పెరిగిన ఆమె, జీవితంలో ఎదురైన కొన్ని బాధలను మనసులోనే దాచుకోవడం నేర్చుకుంది.

 

బయటకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించినా, తన మనసులోని కొన్ని ఖాళీలను మాత్రం ఎవరికీ చూపించేది కాదు.

 

తన తల్లి తనకు ఎప్పుడూ ధైర్యం చెబుతుంది. ఏ సమస్య వచ్చినా తనకు అండగా నిలబడుతుంది. అందుకే తాను కూడా జీవితంలో ఏదో సాధించి, తన తల్లి పడిన కష్టాలకు మంచి ఫలితం ఇవ్వాలని అనుకునేది.

 

అలా ఒకరోజు…

 

ఉదయం నుంచే నవీన ఇంట్లో హడావుడిగా ఉంది.

 

కూతురు కొత్త కాలేజీలో చేరబోతున్న మొదటి రోజు కావడంతో, క్రియన్సీకి కావాల్సినవన్నీ ముందురోజే సిద్ధం చేసింది. కొత్త బ్యాగ్, పుస్తకాలు, ఐడీ కార్డు పెట్టుకోవడానికి చిన్న పౌచ్… ఇలా ఒక్కో వస్తువును మళ్లీ మళ్లీ చూసుకుంటోంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue