New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆలుమగలు – 7
ఆలుమగలు Premium 3 min read

ఆలుమగలు – 7

జనని రెడీ అయ్యి వచ్చి కూర్చుంది…. అప్పుడే సంజన లోపలికి వచ్చింది ఏడుపు మొహంతో…. అక్క ఏంటే అలా ఉన్నావ్….క్రిష్ నవ్వాపుకుంటూ వచ్చి కూర్చున్నాడు….

 

ఏమైందే చెప్పు…. బావ పీనాసోడు అక్క…. ఒసేయ్ ఈ మాట ఆయన గాని వింటే ఇంక అంతే…. మరి ఏమి చేయమంటావే…. వంద ఇచ్చి ముగ్గురుని పంచుకోమన్నాడు…. ఎలా అసలు నా డైలీ పాకెట్ మనీ ఏ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది….

 

అలాంటిది హండ్రెడ్ ఇచ్చాడు…. అందులోను ముగ్గురుకి కలిపి…. అంటే నా వాటా ముప్పై వాళ్ళ వాటా మిగతా చెరో ముప్పై….మా ముగ్గురుకి వాటితో ఏమి చేయాలో అర్ధం కాక ఇదిగో ఇలా వచ్చాను….

 

నిన్ను సలహా అడుగుదామని…. జనని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ…. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చి పడింది….ఇప్పుడు ఆ ముప్పై తో ఏమి కొందామని ప్లాన్ చేసారు….

 

భారీగానే అనుకుంటున్నారా అని అడిగింది….హ అవును అమ్మ బాగా భారీగా ప్లాన్ చేశాం…. అంత మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తున్న….ఎల్లు ఎహే నువ్వు పెళ్లి అయ్యాక మీ ఆయన లాగే మారిపోయావ్ ఛీ అని చెప్పి వెళ్తుండగా….

 

అప్పుడే అజిత్ గుమ్మం దగ్గర నుంచొని కనిపించాడు…. వామ్మో చచ్చాను నేనింకా టైగర్ వచ్చేసింది…. దేవుడా ఇప్పుడు ఏమి చేయాలి విన్నాడో లేదో కూడా అర్ధం అయ్యి చావట్లేదు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue