New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 5

ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 5

నువ్వు నోరు మూసుకో సుధీర్ నా ప్రేమ పెళ్లి మ్యాటర్ జరిగినప్పుడు నువ్వు ఇక్కడలేవు…. నమ్మించి మోసం చేసింది నన్ను… 

 

పైకి ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది అని ఈజీగా నమ్మేస్తాము కానీ తను అంతా ఇన్నోసెంట్ ఏం కాదు అనుభవంతో చెప్తున్నాను… 

 

నేను కూడా తన అందాన్నే…కాదు అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను తల్లి లేదు అంటే మరీ సింపతి ఎక్కువైంది దాంట్లో నా కళ్ళు మూసుకుపోయాయి…

 

కానీ ఏ రిలేషన్ లో అయినా ఓవర్ ఎమోషన్  పనికిరాదాని ఈ అమ్మాయి బుద్ధి చెప్పింది నాకు…

 

లైఫ్ లో ఏదో ఒక రోజు దొరకాలి నా చేతికి అనుకున్నాను… ఈ రకంగా దొరికింది ఇక వదిలే సమస్య లేదు 

 

నేను పడిన బాధలో కనీసం 10% అన్న తనకు పనిష్మెంట్ ఇవ్వనిదే నాకు మనసుకి శాంతి ఉండదు.. అన్నాడు చాలా సీరియస్గా అగస్త్య

 

తన్దైనా అనుకుంటే అది చేసి తీరుతాడు అది సుధీర్ కి బాగా తెలుసు అతని పట్టుదల గురించి ఒకవ్యక్తిపై స్నేహం నమ్మకం కలిగితే  ప్రాణాలు కూడా ఇస్తాడు  

 

సేమ్ టైం అతని నమ్మించి మోసం చేస్తే అసలు తట్టుకోలేడు ఆ కోపంలో  ఆవేశంలో… తీసుకునే నిర్ణయాలు 

 

ఎదుటివాళ్ళను చాలా ఇబ్బందిపెడతాడు అది తనకు బాధ కలిగితేనే చేస్తాడు ప్రస్తుతం ప్రాప్తి అదే పరిస్థితుల్లో ఉంది కానీ 

 

ఈ విషయంలో పాపం ప్రాప్తికి ఎలాంటి సహాయం చేయలేను అనుకున్నాడు సుధీర్…

 

 

€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€

 

 

హాయ్ ఆంటీ అంటూ లోపలికి వచ్చింది ఆలక్షణ  విజయ… చూసి మురిసిపోతూ “అల…. ఎలా ఉన్నావే…?? అంటుంది

 

నేను బాగున్నాను ఆంటీ మీరు ఎలా ఉన్నారు అంకుల్ ఎలా ఉన్నారు అండ్ అగస్త్య అశ్విన్ ఎలా ఉన్నారు అంటుంది స్టైల్ గా… 

 

అందరూ బాగున్నారు ఇక నువ్వు వచ్చావు కదా ఇంకా బాగుంటాం దాని లోపలికి అంటూ లోపలికి తీసుకెళ్తుంది

 

అప్పుడే ఆఫీస్ కి రెడీ అవుతున్నరఘురాంకు అలక్షణ నీ చూపిస్తుంది

 

ఏ మా…ఎలా ఉన్నావు?మమ్మీ డాడీ బాగున్నారా? అని అడుగుతాడు… 

 

బావున్నారు అంకుల్ మీరు ఎలా ఉన్నారు?? అంటుంది విజయ సైగ చేయడంతో కాళ్లు మొక్కుతుంది.. రఘురాం వి 

 

చూసావా?? ఎంత లక్షన్నమైనా పిల్లో…. అప్పుడే ఆ ఇంటి కోడలు అయినట్టుగా మురిసిపోయింది విజయ.

 

 

€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€

 

 

ఇంట్లో తన వర్క్ చేసుకుంటున్నా ప్రాప్తికి అనోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది… 

 

లిఫ్ట్ చేసిన తనకి భయంతో చెమటలు పట్టిస్తాయి ఏం చెప్తున్నావ్ నాగులు..

 

నిజంగా మా కోసం సెర్చ్ చేస్తున్నారా?? అని అడుగుతుంది కంగారుగా ప్రాప్తి.

 

అటు నుంచి చెప్పేది విని సరే ఈ విషయం ఎవరికీ చెప్పకు ఒకవేళ నీకు ఇంకేమైనా విషయాలు తెలిస్తే నాకు వెంటనే కాల్ చెయ్ 

 

అది కూడా ఇలా పక్కఊరి కి వచ్చికాల్ చెయ్ మన ఊర్లో ఉన్నప్పుడు అస్సలు చేయకు వాళ్ళ చేతికి మేము చిక్కువద్దు… అర్థమైందా?? అంటూ 

 

ఇంకాసేపు చెప్పేది విని సరే నీ నెంబర్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను!!

 

ఎట్టి పరిస్థితుల్లో మా ఆచూకీ వాళ్లకు తెలియకూడదు ఏమంటున్నా అంటుంది ప్రాప్తి

 

అటువైపు నుంచి విని సరే మీ నెంబర్ కి నా ఫ్రెండ్ తో మనీ ట్రాన్స్ఫర్ చేయిస్తా 

 

నా నెంబర్ అయితే తెలిసిపోతుంది సరేనా నాగులు జాగ్రత్త అంటూ కాల్ కట్ చేస్తుంది ప్రాప్తి 

 

ఆరోజు రాత్రి తను ఎలా తప్పించుకుంది ఊరు నుంచి… గుర్తుకురాగానే అసలు బతుకుతానూ అనుకోలేదు 

 

పాపను బతికించుకుంటాను అనుకోలేదు అరచేతిలో ప్రాణం పట్టుకొని అర్ధరాత్రి దాదాపు ఎనిమిది గంటలు

 

ఆగకుండా కాళ్లు వాచిపోయేలా పరుగెత్తిన ఆరోజు గుర్తుకు వస్తే జీవితంలో ఇలాంటి కష్టాలు ఎవరికీ రాదు అనే దేవుని వేడుకొంది ప్రాప్తి… 

 

ఇక వర్క్ చేయాలనిపించలేదు లాప్టాప్ పక్కన పెట్టేసి పాప పక్కన పడుకొని గట్టిగా హత్తుకుంది 

 

నా ఈ పోరాటం..లో గెలుస్తానో…?? లేదో??తెలీదు ఒకవేళ ఓడిపోతే…ఆ గద్దలకు కోడిపిల్లల నిన్ను మాత్రం వదలను.. ఆ రాక్షసులకి…

 

నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను ఎ తల్లి ఇలా మాట్లాడదు కానీ నాకు వేరే ఆప్షన్ లేదు 

 

ఈ విషయంలో నువ్వు నన్ను క్షమించు సన…. అంటూ ముద్దు పెట్టుకొని ఏడుస్తూ పడుకుంది 

 

ప్రాప్తి ఎప్పటికిగానీ నిద్రపట్టలేదు తనకి ఈ ఆలోచనలతో….

 

 

€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€

 

 

ఆరోజు చాలా త్వరగానే వెళ్ళింది ఆఫీస్కి ప్రాప్తి. అక్కడికి వెళ్లేసరికి అందరూ స్టాప్స్ అంతా స్టాప్ అంతా ఫేస్ మార్చుకొని నిలబడ్డాడు 

 

వాట్ హప్పెండ్??అని అడిగింది

 

లోపల సార్ చాలా కోపంగా ఉన్నాడు మేడం మీరు రాగానే పంపించమన్నాడు అంటారు 

 

దిక్కుమాలిన ఆఫీస్ నా ఆఫీస్ లో నేను హ్యాపీగా పని చేసుకునేదాన్ని 

 

అక్కడ రూరల్నీ నేనే…అ నిఖిల్ వల్ల వేరొకరితో మాటలు ఇంకా భయపడాల్సివస్తుంది 

 

అనుకుంటూ టైం చూస్తే…ఆల్రెడీ తను ఫైవ్ మినిట్స్ ముందే ఆఫీస్ లో ఉంది 

 

ఇంకెందుకు?? ఈ బాస్ కి కోపం అనుకుంటూ వెళ్లి మీ ఐ కమింగ్ అని అడిగింది… ప్రాప్తి.

 

ఎస్…. అని వినిపించింది అగస్త్య వాయిస్… 

 

సార్ మీరు పిలిచారంట అంటూ చాలా నిదానంగా అడుగుతుంది టైం ఎంత?? అని అడిగాడు 

 

నేను ఐదునిమిషాల ముందే వచ్చాను సార్ అంటుంది 

 

అంటే నేనే త్వరగా వచ్చానని అంటున్నారా…??

 

నో..నో….అనగానే…..

 

సుధీర్ కార్ అరేంజ్ చెయ్ మేడం చెప్పిన టైంకి వస్తాను అన్నాడు ఇరిటేట్ చేస్తూ అగస్త్య

 

ఆ మాట వినగానే కోపంతో ఒళ్ళు మండిపోయింది ప్రాప్తికి అసలు తను ఏమనుకుంటున్నాడో?? 

 

అతని మైండ్ లో ఏం రన్ అవుతుందో?? తెలుసుకోవాలి అనుకుంది 

 

దాంతో అతని మాటలకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడింది చూస్తూ…

 

ఏంటా?? ఆ చూపు ఆల్రెడీ 2 డేస్ నుంచి ఆఫీస్ లో చూస్తున్న అందుకే రాత్రిలో నిద్ర పట్టట్లేదు 

 

ఎ మాటకా మాటే చెప్పుకోవాలి ఇంత అందంగా ఎలా పుట్టావే..??నీ మ్యాజిక్ మొత్తం నాపైనే గుమ్మరిస్తున్నావా??

 

లేక వేరే వాళ్ళుకూడా ఇలాగే అట్రాక్ట్ అవుతున్నారా?నీకు….??అని నిన్ను చూసినప్పుడల్లా డౌట్ వస్తుంది… 

 

అయినా నేనేంటి?? సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను ఆల్రెడీ మేడంకి పెళ్లి అయి తల్లి కూడా అయింది కదా??

 

రేయ్ అగస్త్య నీకు అసలు రోషం లేదురా… ఉంటే ఇలా ఆలోచించవు!! అని ఇన్నర్ లో తిట్టుకున్నాడు అగస్త్య తనని తాను… 

 

పైకి మాత్రం హుందాగా….నిన్న వర్క్ ప్రోగ్రెస్ ఏంటి?? అని అడిగాడు చాలా సీరియస్గా నిజం చెప్పాలంటే… ఏం మాట్లాడాలో..తెలియక

 

వెంటనే తన బ్యాగ్ నుంచి ల్యాపి తీసి చూపించింది అంత కరెక్ట్ గా ఉంది ప్రాప్తిని తిట్టడానికి ఏమీలేదు… 

 

ఓకే ఇవాళ వర్క్….??

 

స్టార్ట్ అవుతుంది అంటుంది చాలా సీరియస్గా….

 

ఆల్ రైట్… రెండు సెకండ్లు ఆగి వెళ్లి కాఫీ కలిపి తీసుకురా… అన్నాడు…

 

వెంటనే బాయ్ ని పిలిచింది సార్ కి కాఫీ అంది ఓకే సార్ అన్నాడు అతను

 

నేను నీకు చెప్పానా?? అని అడిగాడు బాయ్ నీ

 

లేదు సార్ అన్నాడు బాయ్…అయితే నువ్వు వెళ్లొచ్చు అన్నాడు ఆగస్త్య 

 

బాయ్ వెళ్ళిపోగానే “హల్లో….ప్రాప్తి సల్మాన్ నేను కాఫీ కలపమన్నది మీకు అన్నాడు ఆగస్త్య

 

నేనెందుకు?? కలపాలి సార్ మీ…పర్సనల్ వర్క్ కి సపరేట్గా మనుషులు ఉన్నారు కదా?? నేను

 

ఈ కంపెనీకి సంబంధించిన వర్క్ మాత్రమే చేస్తాను అంటూ కోపంగా అతని ముందు నుంచి లాప్టాప్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకుంది… 

 

అంటే ఇప్పుడు కాఫీ కలిపి తీసుకురావా?? అని అడిగాడు ఆగస్త్య

 

నాకు శాలరీ ఇస్తున్నది నిఖిల్ కంపెనీ…మీ కంపెనీతో టైయాప్ అయినందుకే నేను ఇక్కడికి రావాల్సివచ్చింది 

 

ఇక్కడ కూడా నేను వర్క్ చేస్తున్నది ఆ కంపెనీకి మీ కంపెనీకి కాదు 

 

మీకు కావాల్సినంత మంది ఉన్నారు తెప్పించుకోండి అంటూ ఆటిట్యూడ్ గా చెప్పి బయటికి వెళ్లిపోయింది ప్రాప్తి… కోపంగా 

 

షాక్ గా చూస్తున్న ఆగస్త్య చూసి లైట్ గా స్మైల్ ఇచ్చుకున్నాడు సుదీర్ బయటికి కనిపిస్తే చంపేస్తాడని తనకి తెలుసు 

 

తను వెళ్ళిపోయిన వైపు చూస్తూ ఎంత పొగరు రా……?? అప్పుడు ఇంత ఉండేది కాదు చాలా మారిపోయింది అంటాడు ఆగస్త్య

 

పక్క నుంచి వెళ్ళండి సౌండ్ రాకపోయేసరికి ఒరేయ్ ఎదవా నీతోటే మాట్లాడుతున్నాను అనగానే 

 

అప్పుడే పైల్లో నుంచి తలతీసి ఏమైంది రా నేను వర్క్ లో లీనమైపోయాను అన్నాడు 

 

ఎదవ నాటకాలు చేస్తే లిఫ్ట్ లేకుండానే డైరెక్ట్ గా కింది ఫ్లోర్ కి వెళ్తావు విండో నుంచి… అంటూ అరుస్తాడు అగస్త్య… 

 

అప్పుడు నవ్వుకుంటూ ఇప్పుడు చెప్పురా ఏం జరిగింది?? 

 

అంత నీ ముందే జరిగింది కదా చూడలేదా?? అని అడుగుతాడు…అగస్త్య… 

 

మా నాన్నమ్మ ఒక మాట చెప్పేది.ఎప్పుడే గానీ తెగేంత లాగా కూడదు మునిగేంత దిగకూడదు… అని అందుకే కాస్త చూసి చూడనట్టు అనగానే 

 

నీతొక్కలో సామెతలు నాకు అవసరంలేదు ముందు వాళ్ళ నిఖిల్ గాని లైన్లో పెట్టు 

 

అరగంట పదినిమిషాల్లో వాడు నా ముందు ఉండాలి… లేకపోతే నా కంపెనీలో 

 

నువ్వే కాదు వాడికి కూడా కంపెనీ ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అగస్త్య…

 

మరి అంతలా మాట్లాడేసేవేంటి??అడిగింది మౌనిక

ప్రాప్తి కి చాలా క్లోజ్ ఫ్రెండ్ నిఖిల్ కి కజిన్ కూడా 

 

కదా?? నాకు అలాగే అనిపిస్తుంది కానీ ఏంచేయాలి మౌని అంతలా ఇరిటేట్ చేస్తున్నాడు 

 

టుడేస్ కే నా స్టాప్ ముందు నా పరువు మొత్తం తీసేసాడు వాళ్ళు నవ్వుకోవడం 

 

చూసి చూడనట్టు వెళ్తున్నాను ఇంకా 58 రోజులు ఎలా ఉండాలి ఆఫీస్ లో…

 

రాంగ్ డియర్ 88 డేస్ అంది మౌనిక 

 

చూడు మౌని ఇతని వల్ల నా జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది అంటుంది ప్రాప్తి. 

 

మరి ఒకసారి అన్నయ్యతో మాట్లాడానా?? అంటుంది మౌనిక 

 

వద్దే ఆల్రెడీ వాడు ఏడుస్తూనే ఉన్నాడు ప్రాజెక్టు చేతికొచ్చినప్పటినుంచి నా కాళ్లు మొక్కేది ఒకటే తక్కువ… అంది ప్రాప్తి.

 

 

€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€