“అవకాశం ఇస్తే నన్ను నేను నిరూపించుకుంటాను కదా… అంతే అమ్మా, అంతకుమించి ఏమీ లేదు” అని చెబుతాడు అఖిల్. సుప్రియ కూడా, “అవును అమ్మా… వాడు డాన్స్‌ని ప్రొఫెషన్‌గా తీసుకుంటానని కూడా చెప్పడం లేదు కదా… ఒక్క అవకాశం కావాలని మాత్రమే అంటున్నాడు” అని చెబుతుంది.
“సరే ప్రియా… నేను ఆలోచిస్తాను లే” అని చెప్పి కాల్ కట్ చేస్తారు జగదీశ్వరి గారు. ఇంతలో సత్య కూడా అక్కడికి వచ్చి, “అత్తయ్య… ఒక మాట అడుగుతాను. కాదనరు కదా?” అని అడుగుతుంది.
“అడుగు తల్లి… నువ్వు అడిగిన విషయం ఏదన్నా నేను కాదన్నానా?” అని ప్రేమగా అడుగుతారు జగదీశ్వరి గారు.
“సరే అత్తయ్య… సిటీ డాన్స్ కాంపిటీషన్ ఉందంట. ఆయనకి డాన్స్ అంటే ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు కదా… ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా ఆయనకి” అని అడుగుతుంది సత్య.
“ఎప్పుడో జరిగిన విషయాలు ఇంకా మనసులో పెట్టుకుని అలా ఉంటే ఎలా అత్తయ్య… ఆ రోజుల్లో జరిగినది వేరు. ఇప్పుడు ఆయనకి తనని తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది కదా” అని చెబుతుంది.
“ఆయన డాన్స్‌నే ప్రొఫెషన్‌గా తీసుకుంటానని అనట్లేదు అత్తయ్య… కానీ ఒక్క అవకాశం కావాలి అంటున్నారు. అదొక్కటి ఇస్తే చాలు కదా… తనలో ఉన్న టాలెంట్ ఏంటో అందరికీ చూపించుకుంటారు” అని సత్య ప్రేమగా చెబుతుంది.