New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 5

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 5

“పర్లేదు అత్తయ్య గారు… మీరు పెద్దవాళ్లు, నేను చూసుకుంటా కానీ మీరు కూర్చోండి…” అని సత్య చెబుతుంది. ఇక తనని ఇంక పని చేయనివ్వదని అర్థమవడంతో జగదీశ్వరి గారు అక్కడే ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని, సరదాగా తన కోడలితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు…

 

వీళ్లిద్దరూ ఎప్పుడూ అత్తా కోడళ్లలా కాకుండా అమ్మా కూతుళ్లలాగే ఉంటారు… తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు…

 

వాళ్లిద్దరి అనుబంధాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు కొంతమంది కుళ్లుకుంటూ ఉంటారు… మరికొంతమంది అయితే వీళ్లిద్దరినీ ఎలాగైనా విడగొట్టాలని కూడా ప్రయత్నించారు…

 

కానీ వాళ్లు చెప్పే మాటలను సత్య, జగదీశ్వరి గారు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు… ఎక్కడ మాట అక్కడే విని, అక్కడే వదిలేసేవాళ్లు… ఎందుకంటే ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం అంత గట్టిది…

 

అమ్మలా చూసుకునే అత్తయ్య దొరికితే ఏ కోడలు మాత్రం కూతురిలా ఉండకుండా ఉంటుంది చెప్పండి…

 

అలా ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూనే డిన్నర్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోతుంది… సత్య ప్రిపేర్ చేసిన డిషెస్ అన్నింటినీ డైనింగ్ టేబుల్‌పై చక్కగా సర్దుతుంది…

 

అప్పటికే పిల్లల హోంవర్క్ కూడా కంప్లీట్ అవడంతో అందరూ హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు…

 

వాళ్ల ఇంట్లో ప్రతిరోజూ ఎనిమిదిన్నర కల్లా డిన్నర్ కంప్లీట్ చేయడం అలవాటు… సత్య అందరికీ డిన్నర్ వడ్డించి, తను కూడా వాళ్లతో కలిసి కూర్చుని తింటూ ఉంటుంది…

 

అఖిల్ మాత్రం సత్య వైపు చూస్తూనే తన డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు… అతని చూపులు గమనించిన సత్య కూడా అప్పుడప్పుడు అతని వైపు చూసి చిన్నగా నవ్వుకుంటుంది…

 

ఇక వాళ్లిద్దరినీ చూస్తున్న జగదీశ్వరి గారు మాత్రం మనసులోనే నవ్వుకుంటూ ఉంటారు…

 

డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు…

 

అప్పుడే జగదీశ్వరి గారు సత్య వైపు చూసి… “అమ్మా సత్య… పిల్లలిద్దరూ ఈరోజు నా రూమ్‌లో పడుకుంటారు…” అని చెబుతారు…

 

“ఎందుకు అత్తయ్య? నేను చూసుకుంటాను కదా…” అని సత్య వెంటనే అంటుంది…

 

“పర్లేదమ్మా… ఈరోజు నేను చూసుకుంటా…” అని జగదీశ్వరి గారు నవ్వుతూ చెబుతారు…

 

తర్వాత పిల్లలిద్దరి వైపు చూసి… “రేయ్ పిల్లలూ… ఈరోజు నాతో పడుకుంటారా? రండి… నా రూమ్‌లోకి వెళ్దాం…” అంటారు…

 

“హాయ్ నానమ్మా… నువ్వు స్టోరీ చెప్తావా?” అని పిల్లలిద్దరూ ఒకేసారి అడుగుతారు…

 

“చెప్తాను… ఇక నుంచి డైలీ మీరు నా రూమ్‌లోనే పడుకుందురు గానీ… పదండి…” అంటూ జగదీశ్వరి గారు వాళ్లిద్దరినీ తీసుకుని తన రూమ్‌లోకి వెళ్లిపోతారు…

 

అందరూ రూమ్‌లోకి వెళ్లిపోవడంతో హాల్లో సత్య, అఖిల్ మాత్రమే మిగులుతారు…

 

సోఫాలో కూర్చున్న అఖిల్ సత్య వైపు చూస్తూ లేచి ఆమె దగ్గరకు వస్తాడు…

 

“ఏంటి అలా చూస్తున్నావు?” అని సత్య అడుగుతుంది…

 

అఖిల్ చిన్నగా నవ్వుతూ… “ఏం లేదు బంగారం… మనకి ప్రైవసీ ఇవ్వాలని అమ్మ పిల్లల్ని తనతో తీసుకెళ్లింది…” అంటాడు…

 

సత్య వెంటనే అవునా అన్నట్టుగా అతని వైపు చూస్తుంది…

 

“అవును బంగారం…” అని అఖిల్ నవ్వుకుంటూ కిచెన్‌లోకి వెళ్తాడు…

 

కొద్దిసేపటికి ఫ్రిజ్‌లో పెట్టి ఉంచిన మల్లెపూలు తీసుకుని వచ్చి సత్య జడలో పెడతాడు…

 

“మీరు మల్లెపూలు ఎప్పుడు తీసుకొచ్చారు శ్రీవారు?” అని సత్య ఆశ్చర్యంగా అడుగుతుంది…

 

“ఈవెనింగ్ పిల్లల్ని తీసుకురావడానికి బయటికి వెళ్లినప్పుడు కనిపించాయి… నచ్చాయి… అందుకే నీ కోసం తీసుకొచ్చాను బంగారం…” అని అఖిల్ చెబుతాడు…

 

ఆ మాట విన్న సత్య చిన్నగా నవ్వుతుంది…

 

ఇంతలో అఖిల్ ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని రూమ్ వైపు తీసుకెళ్తాడు…

 

అలా ఒక్కసారిగా ఎత్తుకోవడంతో సత్య సిగ్గుపడుతూ అతని భుజం దగ్గర మొహం దాచుకుంటుంది…

 

“శ్రీవారు… అత్తయ్య వాళ్లు చూస్తే బాగోదు…” అని నెమ్మదిగా అంటుంది…

 

“ఆల్రెడీ అమ్మోళ్లు డోర్ వేసుకున్నారు… ఇంకా బయటికి రారు…” అని అఖిల్ నవ్వుతూ చెబుతాడు…

 

“అయితే తెలిసే నన్ను లిఫ్ట్ చేశారన్నమాట…” అంటూ సత్య అతని బుగ్గపై చిన్నగా ముద్దు పెడుతుంది…

 

అఖిల్ వెంటనే ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి… “ఎవరైనా ఇక్కడ ఇలా చేస్తారా?” అన్నట్టుగా చూస్తాడు…

 

సత్య నవ్వుతూ అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది…

 

అఖిల్ మాత్రం ఆమెను ఆటపట్టిస్తూ మెడ దగ్గర గిలిగింతలు పెట్టడంతో… సత్య నవ్వుతూ అటూ ఇటూ కదులుతుంది…

 

“అయ్యో శ్రీవారు… చక్కిలిగింతలు పెడుతున్నారు…” అంటూ నవ్వుతుంది…

 

“అలా కదిలితే పడిపోతావ్ బంగారం…” అని అఖిల్ నవ్వుతూ చెబుతాడు…

 

అలా సరదాగా ఆటపట్టించుకుంటూ సత్యను రూమ్‌లోకి తీసుకువచ్చి డోర్ వేసేస్తాడు…

 

తర్వాత ఆమెను బెడ్‌పై కూర్చోబెట్టి… “ఇక చెప్పు బంగారం… ఇంతసేపు నన్ను ఆటపట్టించింది చాలదా?” అని నవ్వుతూ అడుగుతాడు…

 

సత్య వెంటనే… “శ్రీవారు… ఇలా ఒక్కసారిగా పడుకోబెడితే నడుము నొప్పి వస్తుంది… రేపు నేను నడవలేకపోతే మీకే ప్రాబ్లం…” అంటుంది…

 

అఖిల్ నవ్వుతూ… “పర్లేదులే బంగారం… నువ్వు నడవలేకపోతే నేనే దగ్గరుండి నీకు అన్నీ చూసుకుంటాను…” అని చెబుతాడు…

 

అతని మాటలకు సత్య సిగ్గుపడుతూ నవ్వుతుంది…

 

అలా వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ రాత్రిని ఆనందంగా గడుపుతారు…

 

 

చదివి వెళ్లిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్… 🥰🥰

 

మీ chinni ♥️