సత్యని అఖిల్ లిఫ్ట్ చేయగానే రెండు చేతుల మధ్యలో మొహం దాచుకుని సిగ్గుపడుతూ ఉంటుంది…
“శ్రీవారు… అత్తయ్య వాళ్లు చూస్తే బాగోదు…” అని సిగ్గుపడుతూ చెబుతుంది…
“ఆల్రెడీ అమ్మోళ్లు డోర్ వేసుకున్నారు… ఇంకా బయటకు రారు…” అని అఖిల్ నవ్వుతూ చెబుతాడు…
“అయితే తెలిసే లిఫ్ట్ చేశారన్నమాట…” అంటూ సత్య అతని బుగ్గపై చిన్నగా కిస్ చేస్తుంది…
అఖిల్ వెంటనే “ఎవరైనా ఇక్కడ కిస్ చేస్తారా?” అన్నట్లుగా ఒక లుక్ ఇస్తాడు…
తర్వాత ఆమె మెడ మీద మొహం పెట్టి మీసాలతో గిలిగింతలు పెడతాడు…