రాఖీ ఎత్తిన చేతిని గాల్లోనే ఆపి వాళ్ళు నలుగురు రాఖిని గట్టిగా పట్టుకుని అబ్బో మమ్మల్ని కొట్టేద్దమనేనా నీకు అంత సీన్ లేదుగాని మూసుకొని ఆ పిల్లని మాకు ఇచ్చి నువ్విక్కడనుండి దొబ్బెయ్ బే అంటారు వెకిలిగా నవ్వుతూ……
వాళ్ళు రాఖిని అలా పట్టుకోవడం అండ్ వాళ్ళు మాట్లాడే మాటలకి,వాళ్ళ నవ్వులకి ఆద్య మరింత భయపడుతూ ఏడుస్తూ ప్లీజ్ రాఖిని వదిలేయండి అంటూ ఉంది అక్కడే నిల్చుని….
వాళ్ళు ఆద్య ఏడుపుని చూసి నవ్వుకుంటున్నారు తప్ప ఏం మాట్లాడలేదు…వాళ్ళ మాటలకి,ఆద్య ఏడుపును చూసిన రాఖీ కోపంగా వాళ్ళని వదిలిచ్చుకోవడానికి ట్రై చేస్తు వాళ్ళు నలుగురు గట్టిగా పట్టుకుని ఉండడంతో అతని వల్ల కాక రేయ్ వదలండ్రా నన్ను అంటూ అరుస్తూ వాళ్ళు ఎంతకీ వదలక పోయేసరికి రేయ్ ఎవర్రా మీరు అసలు మీకు మాకు సంబంధం ఏంటి మీకు ఆ అమ్మాయి ఎందుకు….మీ మొహాలు కూడా మేము ఎప్పుడు చూడలేదు మాతో మీకేం పని రా అని అడుగుతాడు….
రాఖీ మాటలకి వాళ్ళు పెద్దగా నవ్వుతూ ఉంటె వాళ్ళల్లో ఒకడు మాట్లాడుతూ అవును బే మాకు నీతో ఏం పనిలేదు మాకు ఆ పిల్లతోనే పని మాకు ఆ పిల్ల మాత్రమే కావాలి ఆ పిల్ల కోసం ఆ పిల్ల మీద పగ తీర్చుకోవడం కోసం రెండు సవత్సరాల నుండి కాపు కాసి ఉన్నాను..
ఇన్నాళ్లకు ఒంటరిగా చిక్కింది దాన్ని ఈరోజు వదిలే ప్రసక్తే లేదు అంటాడు ….
అప్పటివరకు రాఖిని వాళ్ళు వదలడం లేదని ఏడుస్తున్న ఆద్య ఇప్పుడు వాళ్ళు తన మీద రెండేళ్ల నుండి పగ ఉందని,వాళ్ళు వచ్చింది తనకోసమే అనేసరికి వాళ్లకి తన మీద పగ ఏంటో అర్ధం కాక వాళ్ళ వైపు వింతగా అయోమయంగా చూస్తూ ఉంటుంది….
రాఖీ కూడా ఆద్య మీద పగ అనేసరికి వాట్ మీకు ఆ అమ్మాయి మీద పగ ఏంటి మీరు తన కోసం రెండేళ్ల నుండి ఎదురుచూడడం ఏంటి నాన్సెన్స్ తను ఎవరికీ ఏ చిన్న హాని కూడా చేయదు అలాంటి తనపై మీకు పగ ఉండడం ఏంటి అని అడుగుతాడు గట్టిగా….