New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love me again ❤️ – 5

Love me again ❤️ – 5

30 సంవత్సరాలు గడిచిపోయాయి. 1996లో ఆ బస్టాప్‌లో ఆగిపోయిన శీను, శ్రావణి ప్రాణాలు ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఏ రూపంలో ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ, విధికి ఒక లెక్క ఉంటుంది.

 

 

హైదరాబాద్ – 2026.

 

 

[హైదరాబాద్ – గ్లాస్ బిల్డింగ్ – ఉదయం 9:00 గంటలు]

 

 

ఆఫీసు మెయిన్ గేట్ దగ్గర జహ్నవి బ్లాక్ కలర్ లగ్జరీ కార్ ఆగింది. ఆమె డ్రైవర్ డోర్ తీయకముందే, జహ్నవి తనంతట తానే బయటకు వచ్చింది. ఆమె ధరించిన ఐవరీ కలర్ పవర్ సూట్, చేతికి ఉన్న ఖరీదైన డైమండ్ వాచ్, ఆమె చూపుల్లో ఉండే తీవ్రత… అన్నీ ఆమెకున్న ‘పవర్’ని, ఆధిపత్యాన్ని తెలియజేస్తున్నాయి.

 

 

 

ఆమె అడుగు పెట్టిన ప్రతి చోటా ఒక విధమైన నిశ్శబ్దం ఆవహిస్తుంది.

 

 

ఆమె ఆఫీసు లాబీలో నడుస్తుంటే, రిసెప్షనిస్ట్ దగ్గర నుండి మేనేజర్ల వరకు అందరూ భయం, గౌరవంతో తలదించుకున్నారు. ఎవరూ ఆమెను నేరుగా చూడటానికి ధైర్యం చేయడం లేదు. ఆమె ఆఫీసు కారిడార్‌లో ఆమె హీల్స్ చప్పుడు మాత్రమే వినిపిస్తోంది ఆ చప్పుడు ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరికలా ఉంది.

 

 

 

ఆమె నేరుగా తన పర్సనల్ అసిస్టెంట్ (PA) వైపు చూడకుండానే నడుస్తూ…

 

 

 

**జహ్నవి:** (నిక్కచ్చిగా, కోల్డ్ టోన్‌లో) “ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఉన్న క్లైంట్ మీటింగ్ డాక్యుమెంట్స్.. నా డెస్క్ మీద ఉండాలి. నా పర్మిషన్ లేకుండా ఎవరూ నా క్యాబిన్‌లోకి రావద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్సెస్.”

 

 

 

**PA:** “ఎస్, మేడమ్. వెంటనే ఏర్పాటు చేస్తాను.”

జహ్నవి తన క్యాబిన్ లోపలికి అడుగుపెట్టింది. లోపలికి వెళ్లగానే, ఆటోమేటిక్ గ్లాస్ డోర్ క్లోజ్ అయ్యింది. తన చైర్ లో కూర్చుని, బయట ఉన్న సిటీ వ్యూని చూసింది.

 

 

 

బయట ఆకాశం మబ్బు పట్టి ఉంది… మళ్ళీ వర్షం పడే సూచనలు ఉన్నాయి.  ఆమె ముఖం ఒక్క క్షణం మెత్తబడింది. తనకున్న ఈ కోట్ల ఆస్తి, ఈ గంభీరమైన హోదా, ఈ ఆధిపత్యం… అన్నీ ఉన్నా, ఏదో తెలియని ‘ఖాళీ’ ఆమెను వెంటాడుతూనే ఉంది.

 

 

 

అంతలోనే ఆమె ఫోన్ మోగింది.

 

 

[ఆఫీసు – జహ్నవి క్యాబిన్]

ఆఫీసు డెస్క్ మీద ఉన్న ఫోన్ మోగింది. స్క్రీన్ మీద **’నాన్న’** అని పేరు కనిపించగానే జహ్నవి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమెకు ఈరోజు ఏదో ఒక అసహనం ఆవరిస్తోంది. ఒక నిట్టూర్పు విడిచి, గంభీరంగా ఫోన్ లిఫ్ట్ చేసింది.

 

 

**జహ్నవి:** “చెప్పండి నాన్న…” ఆమె గొంతులో ఎప్పటిలాగే కఠినమైన ప్రొఫెషనల్ టోన్ ఉంది.

మరోవైపు నుండి ఆమె తండ్రి గొంతు వినిపించింది, “జహ్నవి, గుర్తుంది కదా? ఈరోజు నీ అమ్మ వర్ధంతి. ఇంట్లో చిన్న పూజ ఏర్పాటు చేశాను. బిజీగా ఉంటావని తెలుసు, కానీ నువ్వు కచ్చితంగా రావాలి. నీకోసం ఎదురుచూస్తాను.”

 

 

ఆ మాట వినగానే జహ్నవి లోపల ఒక చిన్న కల్లోలం. అమ్మ జ్ఞాపకాలు, ఆ రోజు జరిగిన సంఘటనలు… అవన్నీ ఆమెకు ఇష్టం లేదు. కోట్ల సంపాదన, అపారమైన హోదా ఉన్నా, ఈ ఒక్క విషయంలో మాత్రం ఆమె మనసు వెనకడుగు వేస్తుంది. ఆమెకు ఆ ఇంటికి వెళ్లడం, ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు.

 

 

అయినా, తండ్రిని కాదనలేక, గొంతులో ఎటువంటి భావోద్వేగం లేకుండా…

 

 

**జహ్నవి:** “సరే నాన్న… వస్తాను.” అని చెప్పి, వెంటనే ఫోన్ కట్ చేసేసింది.

 

 

ఆమె ఫోన్‌ను టేబుల్ మీదకి గట్టిగా విసిరినట్టు పెట్టింది. మళ్ళీ కిటికీ వైపు తిరిగింది. బయట వర్షం మొదలైంది… మెల్లగా మొదలై, చినుకులు గ్లాస్ మీద పడుతున్నాయి. ఆ వర్షపు శబ్దం ఆమెలోని ఆ ‘ఖాళీ’ని మరింతగా పెంచుతున్నట్టు అనిపించింది.

 

 

తనకున్న ఈ పవర్, ఈ హోదా ఈరోజు ఆమెకు ఒక బరువుగా అనిపిస్తోంది. ఆమె తన సీటు నుంచి లేచి, ఆ గ్లాస్ డోర్ వైపు అడుగులు వేసింది. ఆమె కళ్లలో ఇప్పుడు ఒక వింతైన సందిగ్ధత… ఏదో కోల్పోయినట్టు, కానీ అది ఏమిటో తెలియని ఆవేదన.

 

 

[ఆఫీసు – జహ్నవి క్యాబిన్]

 

 

ఆమె ఫోన్ కట్ చేసిన మరుక్షణమే, డోర్ దగ్గర చిన్నగా ‘నాక్’ శబ్దం వినిపించింది. జహ్నవి తన బాధను లోపలే దాచుకుని, వెంటనే తన ముఖంలో ఆ ‘సీఈఓ’ మాస్క్‌ను ధరించింది.

 

 

జహ్నవి: (నిర్లక్ష్యంగా) “కమ్ ఇన్.”

 

 

ఆమె పర్సనల్ అసిస్టెంట్ (PA) శృతి, చేతిలో ఫైల్స్ పట్టుకుని చాలా జాగ్రత్తగా, భయం భయంగా లోపలికి వచ్చింది. జహ్నవి అహంకారానికి, క్రమశిక్షణకు ఆఫీసులో అందరూ భయపడతారు. శృతి వచ్చి, ఆ ఫైల్స్‌ని జహ్నవి టేబుల్ మీద సర్దిపెట్టింది.

 

 

PA: “మేడమ్… మీరు అడిగిన 2 గంటల మీటింగ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవే. అలాగే… ఆ కొత్త ప్రాజెక్ట్ కోసం వచ్చిన ఆర్కిటెక్ట్స్ టీమ్ ఆఫీసుకి చేరుకున్నారు. వాళ్ళని కాన్ఫరెన్స్ రూమ్‌లో వెయిట్ చేయమని చెప్పాను.”

 

 

జహ్నవి తన చూపును కిటికీ నుంచి అస్సలు మళ్లించలేదు. బయట పడుతున్న వర్షపు చినుకులు గ్లాస్‌ మీద గీతలు గీస్తుంటే, ఆమె అదే చూస్తూ గంభీరంగా ఉంది.

 

 

జహ్నవి: (చల్లని స్వరంతో) “సరే.. వాళ్ళని లోపలికి రమ్మనండి. కానీ గుర్తుపెట్టుకో శృతి, నా టైమ్ నాకు చాలా ముఖ్యం. వాళ్ళకు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వను. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే!”

PA: “సరే మేడమ్, వెంటనే పంపిస్తాను.”

 

 

PA భయపడుతూ బయటకు వెళ్ళిపోయింది. జహ్నవి తన కుర్చీని తిప్పి, టేబుల్ మీద ఉన్న ఫైల్స్‌ని ఒక్కసారి పరిశీలించింది. ఆ ఫైల్స్ మీద ‘న్యూ ప్రాజెక్ట్: సిటీ హెరిటేజ్ డెవలప్‌మెంట్’ అని రాసి ఉంది.

 

 

ఆమె ఆ ఫైల్స్ మీద సంతకం చేయడానికి పెన్ను అందుకుంది. .

 

 

జహ్నవి: (తనలో తాను) “హెరిటేజ్ డెవలప్‌మెంట్… పేరు బాగుంది. .”

 

 

[క్యాబిన్ డోర్ మెల్లగా తెరుచుకుంది. ఇద్దరు ఆర్కిటెక్ట్స్ (క్లయింట్స్) సంకోచిస్తూ, గౌరవంగా లోపలికి అడుగుపెట్టారు. జహ్నవి అప్పటికే ఆ ప్రాజెక్ట్ ఫైల్‌ను పరిశీలిస్తోంది. ఆమె హోదాకు తగ్గట్టే ఆ వాతావరణం చాలా నిశ్శబ్దంగా, సీరియస్‌గా ఉంది.]

 

 

 

జహ్నవి తల ఎత్తకుండానే, ఫైల్ మీద ఉన్న డిజైన్లను చూస్తూ అడిగింది, “ఈ కాన్సెప్ట్ పేరు బాగుంది. ఫీల్ బాగుంది. కానీ, ఈ ‘హెరిటేజ్ డెవలప్‌మెంట్’ విజన్ ఎవరిది? ఇంటర్వ్యూలలో నేను చూసిన వాళ్ళెవరూ ఇంత క్లియర్ ప్లానింగ్ ఇవ్వలేదు.”

 

 

క్లయింట్ గౌరవంగా నవ్వుతూ సమాధానమిచ్చారు, “మేడమ్, ఇది ‘ది గ్రేట్ కృష్ణమూర్తి’ గారి విజన్. పాత తరాన్ని, ఆధునికతను కలపడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనే ఈ ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు.”

జహ్నవి ఒక్క క్షణం ఆగి, తన పెన్నును పక్కన పెట్టి మొదటిసారి వారి వైపు సూటిగా చూసింది. ఆమె కళ్లలో ఒక రకమైన ఆశ్చర్యం.

 

 

“కృష్ణమూర్తి గారా? అంటే మన సిటీలోనే పాత తరం ఆర్కిటెక్ట్స్ లో లెజెండ్ కదా! ఆయనకు ఇప్పుడు 40 ఏళ్లు దాటాయి కదా… ఇప్పటికీ ఆయనే స్వయంగా ఇలాంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను పర్యవేక్షిస్తున్నారా?”

 

 

 

క్లయింట్ తల ఊపుతూ, “లేదు మేడమ్. ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు ఆయన అన్ని బాధ్యతలను తన కొడుకుకి అప్పగించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ఆయనే స్వయంగా హ్యాండిల్ చేస్తున్నాడు. చాలా టాలెంటెడ్ అబ్బాయి మేడమ్.”

 

 

జహ్నవికి తన పాత అలవాటు ప్రకారం “టాలెంట్” అనే పదం వినగానే ఆసక్తి కలిగింది. ఆమె తన కుర్చీని సరిచేసుకుని కూర్చుంటూ, “అవునా.. అయితే కృష్ణమూర్తి గారి వారసుడి ప్రతిభ ఏంటో చూడాలి. ఆయన్ని లోపలికి రమ్మనండి. డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం.”

 

 

[కాన్ఫరెన్స్ రూమ్ – నిశ్శబ్దం]

 

 

క్లయింట్ కొంచెం తడబడుతూనే, “క్షమించండి మేడమ్.. ఆయన ఈరోజు రాలేదు. ఒక అర్జెంట్ ప్రాజెక్ట్ సైట్‌లో బిజీగా ఉండటంతో నన్నే పంపించారు. ఐ యామ్ హిస్ పర్సనల్ అసిస్టెంట్.”

 

 

ఆ మాట వినగానే జహ్నవి ముఖం ఒక్కసారిగా మారింది. ఆమె కళ్ళలోని ఆసక్తి మాయమై, ఒకరకమైన అసహనం, చికాకు చోటు చేసుకున్నాయి. ఆమె తన కుర్చీలో వెనక్కి వాలి, ఆ వ్యక్తి వైపు చాలా సేపు అలాగే నిలకడగా, తీవ్రంగా చూస్తూ ఉండిపోయింది. ఆ చూపులో ఎంతో గంభీరత, అవతలి వ్యక్తిని చిన్నచూపు చూసే ఒక విధమైన ‘సీఈఓ’ అహంకారం ఉన్నాయి.

 

 

ఆ గదిలో నిమిషం పాటు మౌనం రాజ్యమేలింది. క్లయింట్లకు చెమటలు పట్టాయి. జహ్నవి తన పెన్నుని టేబుల్ మీద పడేసి, నెమ్మదిగా లేచింది.

 

 

జహ్నవి: (చాలా చల్లగా, కఠినంగా) “మనం ఏ ప్రాజెక్ట్ గురించి, ఏ స్థాయి కంపెనీతో మాట్లాడుకుంటున్నామో మీకు తెలుసని అనుకుంటున్నాను. కృష్ణమూర్తి గారి వారసుడు రావాల్సింది పోయి, మీరు వచ్చారు. సరే, ఆయన బిజీగా ఉంటే గనుక… ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు, అసలైన వ్యక్తి స్వయంగా వచ్చినప్పుడు నన్ను కలవమనండి. ప్రస్తుతానికి మీటింగ్ క్యాన్సిల్.”

ఆమె ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా, తన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని గదిని వదిలి బయటకు నడిచేసింది. ఆమె హీల్స్ చప్పుడు ఆ కారిడార్‌లో ప్రతిధ్వనిస్తోంది.

 

 

“మేడమ్… మేడమ్! ప్లీజ్ వినండి, మా ఉద్దేశ్యం అది కాదు!” అని క్లయింట్లు ఆమె వెనకాలే పరిగెత్తారు, కానీ జహ్నవి అస్సలు ఆగలేదు. ఆమె తన క్యాబిన్ లోపలికి వెళ్లి, ఆటోమేటిక్ డోర్‌ను గట్టిగా మూసేసింది. ఆ క్లయింట్లు నివ్వెరపోయి అక్కడ ఉండిపోయారు.

 

 

 

 

Aa taruvata……