“సీతా! ఎప్పుడొచ్చారు? ప్రయాణం బాగా జరిగిందా? అందరూ బాగున్నారా?” అని కుశల ప్రశ్నలు అడుగుతుంది.
సీత తన అత్తయ్యతో మాట్లాడుతూ, “అందరం బాగున్నాం అత్తయ్యగారు” అని సమాధానం ఇస్తుంది.
సాయంత్రం 6:00 గంటలకు సుమన చాలా అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్తుంది.
డ్రైవర్‌ని కూడా తీసుకెళ్లకుండా తనే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తుంది.
అక్కడ ఆరడుగుల ఎత్తు, ఫిట్ బాడీతో చూడడానికి అచ్చం రామ్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు.
సుమన వచ్చేటప్పటికి అతను ఎవరినో కొడుతూ ఉంటాడు. సుమన కార్ ఆపి దగ్గరికి వెళ్లి, అతని చేతుల్లో దెబ్బలు తింటున్న వ్యక్తిని చూస్తూ భయపడి అలాగే వణుకుతూ నిల్చుంటుంది.