రాఖీ ఫోన్లో ఉన్న ఆద్య ఫోటోని చూసి కామేష్ అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు షాక్ అవుతారు…..
వాళ్ళు అలా ఆద్య ఫోటో చూసి ఎందుకు షాక్ అయ్యారో అర్థంకాని రాఖీ విషయం ఏంటి అని అడగడంతో రేయ్ మామ నీకు నేను ఇప్పటిదాకా చెప్పింది ఈ పిల్ల గురించేరా….ఇదేరా ఆరోజు నన్ను అంత మంది ముందు చెప్పుతో కొట్టింది….
దీనివల్లేగా పోలీసోళ్ల చేతుల్లో తన్నులు తినాల్సి వచ్చింది అంటూ కోపంతో ఊగిపోతూ పళ్ళు పట పట కొరుకుతూ దీని మొహం చూస్తే నాకు ఆరోజు జరిగిన అవమానమే గుర్తొస్తుంది…దీన్ని వదలనురా…దీన్ని ఏదో ఒకటి చేసిందాకా నాకు నిద్ర పట్టదు అంటూ అరుస్తాడు.
రాఖికి మేటర్ పూర్తిగా అర్ధమయింది..తనకి నచ్చిన అమ్మాయి కామేష్ పగ తీర్చుకోవాల్సిన అమ్మాయి ఇద్దరు ఒక్కటే అని..
సో కొద్దిసేపు ఆలోచించి ఏదో ఐడియా తట్టినట్టుగా నవ్వుతూ రేయ్ మామ నీ పగ,నా కోరిక రెండు ఒక్కసారే తీరిపోయే ఐడియా వచ్చిందిరా అని చెప్తాడు రాఖీ….
అందరు ఏంటి అని అడగగా ఐడియా చెప్తాను గాని ఈ పిల్ల డీటెయిల్స్ మీకు తెలుసా అని అడుగుతాడు రాఖీ….