New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 163

మాంగళ్య బంధం – 163

దాంతో శాంతి గారు చెప్పిన విషయాన్ని భానుకి చెప్పి ప్రతిమ మిమ్మల్ని కచ్చితంగా ఇక్కడికి రావాలి అని కోరుకుంటుంది భాను..

 

నిజం చెప్పాలి అంటే నాకంటే ఎక్కువగా తనే మీరు రాకుంటే ఎలా అని పట్టుబట్టి మరీ ఫోన్ చేపిస్తుంది.. నీ మరదలు కోరుకుంటున్నాందుకైనా నువ్వు అల్లుడుగారు పిల్లల్ని తీసుకుని వస్తే బాగుంటుంది..

 

ప్రణయ్ కి పెళ్లి అయిన తర్వాత మీరు ఇటువైపు వచ్చిందే లేదు.. నేను కూడా ఊరికే అల్లుడుగారు ఇబ్బంది పెట్టడం అని కామ్ గా ఉన్నాను కానీ రేపు కార్యక్రమం రోజు మీరు లేకుంటే బాగుంటుందా..

 

అసలే మన ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్లవి.. అందుకే అల్లుడు గారికి చెప్పి రేపు తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చేలా చూడు బంగారం.. నువ్వు నీ భర్త పిల్లలతో కలిసి వస్తే మేమందరం సంతోషిస్తాము అని చెప్పి మరి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు ..

 

 

యశోద గారు ఫోన్ పెట్టేసిన తర్వాత  అమ్మ ప్రతిమ   పూసలు కుచ్చే కార్యక్రమం మీ ఇంట్లో జరుగుతుంది కాబట్టి  మీ అమ్మానాన్నలు సాయంత్రం వచ్చి నిన్ను తీసుకెళ్తారు..

 

నువ్వు నీకు కావలసినవి ఏమైనా ఉంటే వెళ్లి సర్దిపెట్టుకొని ఉండు తల్లి.. రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేస్తావు ఇక్కడికి.. ఒక రోజుకు మాత్రమే నీకేమైనా ముఖ్యమైన ఉంటే తీసి పెట్టుకో..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue