New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 8

ఎవరిది ప్రేమ? – 8

అలా జరుగుతున్న సమయంలో ఒక రోజు ఆద్య  ఇంటికి వాళ్ళ మేనత్త కొడుకు ఆద్య కి బావ అయిన “దిలీప్” వస్తాడు…..

 

దిలీప్ ని చూసి ఆద్య అమ్మ, నాన్న చాలా సంతోషిస్తూ  నవ్వుతూ ఎదురెళ్లి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఏరా దిలీప్ ఎలా ఉన్నావ్…అమ్మ, నాన్న అందరు బాగున్నారా…

 

ఎన్ని రోజులకు నీకు ఈ మేనమామ ఇల్లు గుర్తొచ్చిందిరా రారా లోపలకి అంటూనే చాలా పెద్దాడివి అయిపోయావ్ రా…  చిన్నప్పుడు ఎప్పుడు చూసిన ఇక్కడికి వస్తూ అత్త, మామ అంటూ మా చుట్టు తిరిగేవాడివి…..

 

ఇప్పుడు అలాంటివి ఏం లేవుగా ఎంతయినా పెద్ద బిజినెస్ చేస్తున్నావ్ కదా ఇంక నీకు మేమెక్కడ గుర్తుంటాంలే అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూనే దిలీప్ వాళ్ళింటికి రావడం మానేసాడని వాళ్ళ బాధని కూడా అలా వెళ్ళగక్కుతున్నారు…..

 

దిలీప్ వాళ్ళ మాటలకి, వాళ్ళ మాటల్లో తనపై ఉన్న ప్రేమ కనిపిస్తుంటే అత్త, మామల్ని ప్రేమగా చుట్టేస్తూ ఇద్దరికీ చెరొక ముద్దు పెట్టి అయ్యో డార్లింగ్స్ నేను మిమ్మల్ని మర్చిపోవడం జరుగుతుందా  చెప్పండి…..

 

నేను ఎంత పెద్ద వాడిని అయిన ఇంకెంత పెద్ద బిసినెస్ లు చేస్తున్న  మిమ్మల్ని మర్చిపోవడం కల్లో కూడా జరగదు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue