రాజీవ్ మోహంలో నవ్వు లేకపోగా శాన్వి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఇది ప్రాంక్ కాదు శాన్వి అలా అని జోక్ అసలే కాదు.. నేను అడిగిన దానిలో క్లారిటీ ఉంది.. మామయ్య తన నిర్ణయం చెప్తే నేను నా నిర్ణయం తీసుకుంటాను నాకు టైం వేస్ట్ చేయడం అంటే చిరాకు అని చెప్పేశాడు…
జోక్స్ చేసింది చాలు ఇక ఇంట్లోకి వెళ్దాం పదండి అంది శ్రావ్య… రాజీవ్ చేతిని పట్టుకుని…
చేతిని విధిలించి ఏయ్!!! ఏంటే మీ అందరికీ పిచ్చోడిలా కనిపిస్తున్నానా??? అసలేం అనుకుంటున్నారే మీ వాళ్ళు నా గురించి ?? ఒకరేమో ఫ్రాంక్ అంటారు మరొకరు జోక్ అంటారు అని కోపంగా శ్రావ్య జుట్టు పట్టుకున్నాడు…
ఆహ్!! నొప్పి వదలండి అనగానే చుట్టు ముట్టిన కుటుంబం విడిపించి బాలింత పై చెయ్యి చేసుకుంటారా అసలు మనిషేనా మీరు? అని కూతురు ని అక్కున చేర్చుకున్నారు సులోచన గారు…