New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 12

ఏమ్ మాయ చేసావే..!! – 12

నీకే మర్యాద లేని చోట మమ్మల్ని తీసుకొచ్చి అవమాన పడేలా చేశావ్ అని ఆ సంబంధం వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ కోపం ఇంటికి వెళ్లి శ్రావ్య మీద తీర్చుకుని పుట్టింటికి పంపించేసాడు.. అప్పటికే హిమశ్రీ కి పది నెలలు.. వాడు ఎలాంటి వాడు అనేది కూతురికి తెలియదు  కాబట్టి హిమశ్రీ వాడ్ని చూడగానే చేతులు చాపి తండ్రి ని ఎత్తుకొమ్మని తల్లి చంకలో ఉండే ఎగురుతుంటే.. శ్రావ్య చేతుల్లో ఉన్న హిమని ఎత్తుకొగానే చెంపలపై ముక్కు పై ముద్దు పెడుతూ కూతురు అంటే ప్రాణం అయ్యేలా చేసుకుంది….

 

 

అలాంటి ప్రాణాన్ని ఒక రోజు కూడా చూడకుండా ఉండలేనంత ప్రేమ పెంచుకున్నాడు రాజీవ్ … భార్య ని కోపంతో పుట్టింటికి అయితే పంపించేసాడు కానీ కూతురు ని వదిలి ఉండలేక మరుసటి రోజే వెళ్లి కూతురుని ముద్దాడాడు..

 

 

శ్రావ్య ని కొట్టిన దెబ్బలకి… తన వల్లే తండ్రి కదలలేని స్థితిలో ఉన్నాడనే కోపంతో రాజీవ్ పై కేస్ పెట్టాలని నిర్ణయించుకుంది శాన్వి…

 

 

కానీ తెల్లవారగానే వచ్చిన రాజీవ్ కూతురు ని దగ్గరికి తీసుకొని శ్రావ్య ని పిలిచి బయలు దేరామన్నాడు…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue