నేను చెప్తాను మిస్ అని కార్ దిగుతూ చెప్పి కార్ ఎప్పుడు సైడ్ కే ఆపాలి నడి రోడ్ పై కాదు… నేను సైడ్ కే ఆపాను మిస్.. నువ్వే రోడ్ మీద నడుస్తూ నా కళ్ళేక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నావ్…
నా కళ్ళు కార్ డిక్కీ లో పెట్టి నడిపితే రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ లో గ్లోబల్ బిజినెస్ అకాడమీ స్టూడెంట్ మిస్ శాన్వి ఆక్సిడెంట్ లో అని సాగదీస్తుంటే ఆపండి అంది….
హ్మ్ ఆపితేనే బ్రతికి పోయావ్ అని విసుగ్గా చెప్పి కృతి అని పిలిచాడు
అది రాదు అని కృతి చెయ్యి పట్టుకుని చెప్పింది శాన్వి…