సార్ అంటూ రెస్పెక్ట్ తో దూరం పెడుతున్న ఉదయ్ తో నా టెంపర్ తెలిసి కూడా నాటకాలు ఆడొద్దని సీరియస్ గా చెప్పి ఆ కోపంతోనే ఒంటి మీద షర్ట్ తీసి అక్కడే విసిరి కొట్టి విస విసా బెడ్ రూమ్ లోకి పోయాడు రాణా.
అతను బెడ్ రూమ్ లోకి వెళ్తుంటే రానా కాళ్ళ కింద పడి పగులుతున్న వస్తువుల సౌండ్స్ కి ఉదయ్ ఒళ్ళు జలదరించింది.
తను ఒక్కటే ఇదంతా చేయలేదు. చెప్పిన ఎవరు నమ్మరు డెఫినిట్ గా ఏదో జరిగిందని అనుకున్న ఉదయ్ నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువుల మధ్యలో స్పేస్ చూసుకుని అడుగులు వేస్తూ వాటిని తొక్కకుండా బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.