నాన్న అందరికీ దూరంగా ఉండమన్నాడు, ఎవరితో కూడా కాంటాక్ట్ లో ఉండొద్దు అన్నాడు ఆఖరికి విజ్జుతో కూడా.
కానీ..! ఎందుకు తను ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లి అయ్యి నా దగ్గర ఎందుకు దాచింది.. అసలు విజ్జు గాడి గురించి ఎందుకు దాచింది.
వాడు తండ్రి అవుతున్నాడు అని వాడికి కూడా తెలియదా..? లేక వాడు మోసం చేశాడా..! నా చెల్లిని.
ఛీ..ఛీ.. అలా అనుకోవద్దు తప్పు.. వాడి గురించి నాకు తెలుసుగా అలా చేయడు కానీ..! ఏం జరిగింది..” అనే వేలా ప్రశ్నలతో తల పగిలిపోతూ ఉంటే తల ఒత్తుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అర్జున్.
“సార్ లేట్ అయిపోతుంది.. సార్ ప్లీజ్ కంప్లీట్ చేయండి,సైన్ చేయండి..” అని అంది నర్స్ అర్జున్ ని చూస్తూ.