అవసరంలో ఉన్న వాళ్ళకి ఆత్మ అభిమానం ఉండకూడదు. ఉన్న దానికి వాల్యూ ఉండదని స్థిమితంగా ఒక నిర్ణయం తీసుకున్న చైత్ర
ఉదయ్ తో అగ్రిమెంట్ గురించి జాబ్ గురించి తర్వాత స్టార్ట్ అవ్వాలని నిర్ణయించుకొని ఆఫీస్ టైం ఫినిష్ అవ్వడంతో క్యాబిన్ కి వెళ్లి తన థింగ్స్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయింది.
గేట్ దగ్గర సెక్యూరిటీని అడిగి సిటీ బస్ స్టాప్ కనుక్కొని బస్సు ఎక్కడానికి అని వెళుతుంటే వికాస్ కాల్ చేశాడు.
హాయ్ చైత్ర, హౌ ఈజ్ యువర్ ఫస్ట్ డే..??
చాలా ఎక్సైట్ మెంట్ తో అడిగాడు వికాస్.