New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
గతం వెంటాడిన ప్రేమ 💔 – 4

గతం వెంటాడిన ప్రేమ 💔 – 4

దానికి సిరి పాపకి వినిపించక మాట్లాడకపోవడం తో అమ్మ సత్య అని పిలుస్తాడు.

 

 

హా అన్నయ్య అని సత్య అనగా…..

 

 

సిరి ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని కొంచం గట్టిగ అడగడం తో అప్పుడు సిరికి వినిపించి తనని ఏకవచనం తో పిలవడం తో ముందు షాక్ అయినా తర్వాత తన కన్నా పెద్ద వాడే అని అనుకోని వాళ్ల ఇంటి అడ్రెస్స్ *#*#*# అని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోతుంది సత్య అడగక ముందే ఇంకా సత్య కూడా ఫోన్ చూస్కోడం లో మళ్ళీ బిజీ అయిపోతుంది.

 

 

 

ఇంకా సిరి అలా టక్కున చెప్పేయడం తో గౌతమ్ పెదవుల పైన అలా నవ్వు వచ్చి చేరుతుంది.

 

 

సత్య ఇంకా తన ఫోన్ లో రీల్స్ చూస్తూ ఉంటే ఒక రీల్ లో “ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహావా”అన్న సాంగ్ వస్తూ ఉంటే దాని అలాగే వింటూ ఉంటుంది.

 

 

మన గౌతమ్ బాబు కూడా ఆ పాట ని ఎంజాయ్ చేస్తూ ఆ సాంగ్ లో తనతో సిరి ని ఊహించుకుంటూ వాళ్ల ఇంటి దగ్గర ఉన్న గల్లీలోకి కార్ ని పోన్నించి వాళ్ల ఇంటి ముందు కార్ ఆపి సిరి వైపు చూస్తాడు.

 

 

సిరి కి వాళ్ల ఇల్లు కనిపించి సత్య చేతి మీద చేయి వేసి సత్య నేను ఇంకా వెళ్తాను అని చెప్తుంది.

 

 

దానికి సత్య కన్నా ముందే వాళ్ల అమ్మ చెప్పేది వెంటనే గుర్తొచ్చి వెళ్తాను కాదు “వెళ్ళొస్తాను” అనాలి అని అంటాడు గౌతమ్ బాబు.

 

 

దానికి సత్య నవ్వుతూ చూస్తుంటే సిరి కి కూడా నవ్వు వచ్చిన దాన్ని పైకి చూపికుండా అలాగే అండి అని గౌతమ్ తో అని బాయ్ సత్య బాయ్ గౌతమ్ గారు అని కార్ దిగి వాళ్ల ఇంటి లోపలికి వెళ్లి మళ్ళీ వాళ్లకి చెయ్యి ఊపుతుంది బాయ్ అన్నట్టు.

 

 

ఇంకా వాళ్లు కూడా చెయ్యి ఊపి తను లోపలికి వెళ్లే దాకా చూసి వాళ్ళ అత్తగారిల్లు ఇదే అని గౌతమ్ బాబు ఫిక్స్ అయిపోయి కార్ స్టార్ట్ చేస్తాడు.

 

 

ఒక 30 మినిట్స్ తర్వాత కార్ ని వాళ్ల పోర్టికో లో పార్క్ చేసి సత్య కన్నా ముందే లోపలికి వెళ్లి అమ్మ సత్య వచ్చింది అని చెప్తాడు నిర్మల గారితో.

 

 

ఇంకా ఆవిడ కిచెన్ లో నుండే దాన్ని గుమం దగ్గరే ఉండమను రా అని ఎర్రనీలు ప్లేట్ తో పట్టుకొని సత్య ముందుకు వెళ్లి ప్లేట్ తో దిష్టి తీసి హారతి ఇచ్చి పని అమ్మాయితో ఆ ప్లేట్లో నీళ్లు వంపేసి రమ్మని ఎండుమిర్చి ఉప్పు తో కూడా దిష్టి తీసి అప్పుడు లోపలికి వెళ్ళడానికి దారి ఇచ్చి అవి పడేయడానికి బయటికి వెళ్తారు.

 

 

మళ్ళీ లోపలికి వెళ్లిన వెంటనే కూతురిని గుండెల్లకి హత్తుకొని ఎలా ఉన్నవే ఇన్ని రోజులు ఈ అమ్మని చూడకుండా ఎలా ఉండాలని పించిందే నీకు అని కూతురిని పట్టుకొని ఏడ్చేశారు 🤧.

 

 

(అసలు ఏంటంటే విషయం సత్య ఇంటర్ అప్పుడు హాస్టల్ కి వెళ్ళింది కానీ హాస్టల్ దూరం కావడం తో ఇన్ని రోజులు ఇంటికి దూరం గా ఉండి ఇప్పుడు బీటెక్ కాలేజీ కూడా అడ్మిషన్ ప్రాసెస్ అన్ని ఇంటర్ లో ఉన్నపుడే అయిపోవడం హాలిడేస్లో ఫ్రెండ్స్ తో అరకు వెళ్లడం హాలిడేస్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ గా ఇంటికి రాకుండా అటునుంచి అటే ఫస్ట్ డే కాలేజీ కి వెళ్లి ఇలా ఈవెనింగ్ ఇంటికి వచ్చింది. కానీ గౌతమ్ చెల్లి ని అప్పుడప్పుడు వెళ్లి చూసి వచ్చేవాడు అలా సత్య వాలా అమ్మ నాన్న తోనే దూరం గా 2 ఇయర్స్ ఉంది అన్నమాట.)

 

ఇంకా సత్య కూడా వాళ్ళ అమ్మని గట్టిగ హత్తుకొని ఏడ్చి మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకొని వాళ్ళ అమ్మని గౌతమ్ సత్య ఇద్దరు ఊరకోబెడతారు.

 

 

ఇంకా సత్య చుట్టూ చూస్తు అమ్మ నాన్న లేడా అని అడుగుతుంది.

 

 

 

దానికి నిర్మల గారు వచ్చి 10 నిమిషాలు కాలేదు అప్పుడే నాన్న అంటుంది చూడు అమ్మ పక్కనే ఉండగా అని కంప్లైంట్ ఇస్తారు కొడుకుకి కూతురి మీద.

 

 

అబ్బా అది కాదమ్మా నాన్న కనిపించలేదు అని అడిగాను అంతే అని వాళ్ళ అమ్మని ఐస్ చేసే పనిలో పడుతుంది.

 

 

 

వీళ్లని చూసి గౌతమ్ నవ్వుతూ ఉంటాడు.

 

 

మీ నాన్న ఆఫీస్ కి వెళ్లారు రా మీటింగ్ ఉంటే ఈవెనింగ్ తొందరగా వచ్చేస్తాను అని చెప్పారు అని అంటారు నిర్మల గారు.

 

 

 

అవునా సరే అమ్మ కొద్ది సేపు రెస్ట్ తీస్కుంటాను అని తన రూమ్ కి వెళ్లి తన రూమ్ క్లీన్ గా ఉండడం చూసి అబ్బా మా నాన్న కి నేనంటే ఎంత ప్రేమో అని మురిసిపోతు నిద్ర కి ఉపక్రమిస్తది సత్య పాప .

 

 

(ఇక్కడ చేసింది అమ్మ ఐతే నాన్న అంట చూడు మొఖం ఇది మీ అమ్మ కి తెలియాలి నీకు ఉంటది సత్య )

 

 

ఇక్కడ నిర్మల గారు కూతురు వచ్చారు అని ఇంకా తనకి నచ్చిన కూరలు బిర్యానీ వండడానికి కిచెన్ లోకి వెళ్తారు ఇంకా గౌతమ్ కూడా తన రూమ్ కి వెళ్లి రెస్ట్ తీస్కుంటాడు.

 

 

 

 

కంటిన్యూస్….

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.