:: 8వ భాగం ::
కాలేజీ క్యాంటిన్ బయట ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది. నల్లని మేఘాలు సూర్యుడిని పూర్తిగా కప్పేయడంతో అప్పటివరకు వెలుగులతో కళకళలాడిన ప్రాంగణమంతా మసకబారిపోయింది.
మరుక్షణమే చినుకులు మొదలయ్యాయి. చూస్తుండగానే అవి పెద్ద వర్షంగా మారిపోయాయి.
క్యాంటిన్ పైకప్పుపై వర్షపు చినుకులు పడుతూ చేసే శబ్దం పరిసరాలన్నింటినీ నింపేసింది. పైకప్పు అంచుల నుంచి నీళ్లు ధారలుగా కిందికి జారిపడుతుంటే, క్యాంటిన్ ముందు ఉన్న సిమెంట్ నేలపై చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పడ్డాయి.
ఆ వర్షపు చినుకులను చూస్తూ మోక్ష కొద్దిసేపు ఆలోచించింది. తన చేతిలో ఉన్న బాక్స్ లోని కార్డు మరియు మ్యాచ్ స్టిక్ తీసి టేబుల్ పై ఉంచింది!
“ ఎవరో మన ఏడుగురి గురించి బాగా తెలిసిన వ్యక్తే ఈ బాక్స్ ని పంపాడు అని అనిపిస్తుంది! “ అంది ప్రశాంతంగా.