🔥 జ్వాలా అనే నేను 🔥
“తల్లి వెనుక దాగిన రాక్షసి!”
సుజాతే అనన్యను తీసుకెళ్లిందన్న వార్త వినగానే జ్వాలా ఒక్కసారిగా కంగారుపడింది.
“అది అసాధ్యం! నా తల్లి అనన్యను ఎందుకు తీసుకెళ్తుంది? ఆమెను కాపాడటానికా… లేక ఏదైనా హాని చేయడానికా?”
మహతి సమాధానం చెప్పలేదు. ఆమె చూపు ఆదిత్య మీదే నిలిచిపోయింది.
“జ్వాలా, నీకు నిజం కావాలంటే ముందు ఇతన్ని ఒక ప్రశ్న అడుగు. అనన్యను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు ఒక షరతు పెట్టావా లేదా?”