ఇంట్లో ఎక్కడ చూసినా శాన్వి జ్ఞాపకాలే శౌర్య ను వదలని నీడలా వెంటాడుతూ ఉన్నాయి……….. !! మార్నింగ్ శౌర్య నిద్రలేవగానే ఎదురుగా కాఫీ కప్ తో కనిపించే శాన్వి అందమైన నవ్వు ………… !! తనకంటే ముందే నిద్ర లేచి పూజ చేసి ఇంట్లోని దేవుడి దగ్గర దీపం వెలిగిస్తూ …………. !! మనస్ఫూర్తిగా అందరూ క్షేమంగా ఉండాలని శౌర్య జీవితంలో ఎలాంటి ప్రాబ్లెమ్ రాకూడదని కోరుకుంటూ ప్రార్థించే తీరు ………… !! పూజ పూర్తయ్యాక కుంకుమ పెట్టుకుని చేతిలో హారతి ప్లేట్ తో శౌర్య దగ్గరకు వచ్చి ప్రేమగా నవ్వే విధానం ………… !! ఒక్కోసారి శౌర్య కు కోపం వచ్చినప్పుడు బుజ్జగిస్తూ, మరికొన్నిసార్లు తన కోపాన్ని మరింత పెంచేలా అల్లరి చేస్తూ ఆటపట్టించే తీరు ………… !! ఇలా ప్రతి చిన్న విషయం కూడా కళ్లముందు కదలాడుతుంటే శౌర్యకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు మెరిసింది……….. !! కానీ ఆ మరుక్షణమే తన పక్కన శాన్వి లేదన్న నిజం గుర్తొచ్చి శౌర్య మనసంతా దిగులుతో నిండిపోయింది ………… !!
ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతూ, తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే శాన్వి ఇప్పుడు పక్కన లేకపోవడంతో ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా అనిపిస్తోంది……….. !! తన రూమ్ లోకి వెళ్లినా ఆమె జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి తన పక్కన కూర్చుని కబుర్లు చెప్పిన క్షణాలు గుర్తొస్తుంటే శౌర్య పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసినా ………… !! మరుక్షణమే శాన్వి తన దగ్గర లేదన్న ఆలోచనతో ఆ నవ్వు మాయమవుతోంది……….. !!
అయినా శాన్విని పదేపదే కాల్ చేసి ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అవుతూ ……….. !!అప్పుడప్పుడు మాత్రమే తనకు కాల్ చేసి రాజీవ్ హెల్త్ గురించి అడిగి తెలుసుకుంటున్నాడు……….. !! శాన్వి గొంతు వినగానే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తున్నా తన ఎదురుగా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ మాత్రం శౌర్య లో తగ్గడం లేదు……….. !! లేదు తనకు కూడా నన్ను చూడాలని ఉంటుంది కానీ మావయ్య హెల్త్ బాగోలేని కారణంగా తను అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది………. !! ఇప్పటికే ఎన్నో బాధ్యతలు తన మీద ఉన్నాయి ఇప్పుడు నేను కూడా తనను ఇబ్బంది పెట్టడం ఎందుకు…………?? ఇంకొన్ని డేస్ ఓపిక పడితే మావయ్య హెల్త్ క్యూర్ అవ్వగానే తనను తీసుకొచ్చేస్తాను ……….. !! అని మనసులో అనుకుంటూ తనకు తానే సర్దిచెప్పుకున్నాడు శౌర్య………..!!
శాన్విని మిస్ అవుతున్న బాధను కాస్తైనా తగ్గించుకోవాలంటే తన కోసం ఏదైనా స్పెషల్‌గా చేయాలని ఫిక్స్ అవుతాడు శౌర్య ………… !! అందుకే నెక్స్ట్ డేనే శాన్వికి ఒక మంచి సర్‌ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అవుతూ ………….. !! తన మనసులోని ప్రేమను మరోసారి కొత్తగా ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటూ వెంటనే మొబైల్ తీసుకుని ఆన్‌లైన్‌లో రకరకాల ప్రపోజల్ ఐడియాల కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు………….. !!