జ్వాల తన కళ్ళ ముందు ఉన్న అతన్ని అలా ట్రాన్స్ లో ఉండి మరీ చూస్తూ అతని అందాన్ని లోలోపల పొగుడుకుంటూ కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది….
ఆమెని పడకుండా పట్టుకున్న వ్యక్తి హలో మిస్ మిమ్మల్నే పిలుస్తున్నాను… ఎంతసేపని ఇలానే ఉంటారు పైకి లేవండి…
మీరు లేస్తే నేను వెళ్ళాలి.. అవతల నాకు చాలా పని ఉంది అని కొంచెం పెద్దగా అనేసరికి ఊహల్లో ఉన్న జ్వాల ఒక్కసారిగా ట్రాన్స్ లో నుండీ బయటకి వచ్చి తనున్న పొసిషన్ చూసుకుని టక్కున అతనికి దూరం జరిగి మీ.. మీరు ఎవరు.?
నే.. నేను ఇలా మీ చేతుల్లో ఎలా అంటూ తడపడుతూ నేను బస్ లో నుండి కిందకి పడిపోయాను కదా…మరి రోడ్డు మీద ఉండకుండా మీ చేతుల్లో ఎలా వున్నాను అంటుంది ఆశ్చర్యం ప్లస్అయోమయంగా మొహం పెట్టి ….