New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షస ప్రేమిక – 17

రాక్షస ప్రేమిక – 17

అగస్త్య అక్కడి నుండి రెండు అడుగులు వెన్నక్కి వేసి పక్కనే ఉన్న వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక వస్తువు తీసి అలకనంద వైపు చూపిస్తాడు.. అది చూడగానే నో అని అంటూ అక్కడే అసలే ఫీవర్ కాస్త హై టెంపరేచర్ పెరిగిపోయేసరికి..కళ్ళు తిరిగి పడిపోతుంది నందు

 

కింద పడిన నందు నీ చూసి కంగారుగా అగస్త్య పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్ళు జల్లుతూ..తనని వొళ్ళో పడుకోబెట్టుకొని…లేపడానికి ట్రై చేస్తాడు…ఆమె వొళ్ళు మళ్ళీ కాలిపోవడం చూసి ఆమె నుదుటి మీద చెయ్యి వేసేసరికి మొత్తం వేడి తెలుస్తుంటే…

 

 

నందు ఇంతలో కళ్ళు మెల్లిగా తెరుస్తూ..అంత దెగ్గరగా ఉన్న అతన్ని చూస్తుంటే..అతడి నుదుటి మీద ఉన్న రక్తపు మరక కాస్త ఆమె నుదుటి మీద పడుతుంది…అలకనంద కంగారుగా లెగిసి అగస్త్య వైపు చూస్తూ…”ప్లీజ్ అండి నన్ను వదిలేయండి…ప్లీజ్!!”అనేలోపు…

 

అగస్త్య ఆమె అతన్ని చూసి కోపడం నచ్చక కళ్ళు ఎర్ర జేసి…కోపంగా…”నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావ్ నువ్వు!!”అని కోపంగా అడుగుతాడు…

 

 

అలకనంద రెండు అడుగులు వెన్నక్కి వేసేలోపు…అగస్త్య ఆమె చెయ్యి పట్టుకుని ఆపుతూ…”అసలు నిన్ను ఎవరు నా జీవితం లోకి రమ్మన్నారు…నిన్ను ఎవరు నా ఇంటికి రమ్మన్నారు..!!”అని అడుగుతూ అతడి చేతిలో ఉన్న తాళి బొట్టు నీ నందు కి కట్టబోతుంటే…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue