దానికి రాధిక సారీ సాగర్ గారు నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు.ఈ సరీ మాత్రం అడ్రస్ మీరు చెప్పినట్టు అస్సలు తెలియనివ్వను,నేను బయట తెలుసుకున్నాను అని చెప్తాను అని అనటంతో, సారీ వద్దులే మన మన సార్ అంతే కదా అని చెప్పి అడ్రస్ చెప్తాడు.
ఓకే థాంక్యూ సాగర్ గారు మీరు చెప్పినట్టు మాత్రం అస్సలు సార్ కి తెలియనివ్వను ఓకేనా అని చెప్పి , ఓకే సాగర్ గారు బాయ్ గుడ్ నైట్ అని చెప్పి రాధిక ఫోన్ పెట్టేస్తుంది.
*************
ఇక అడ్రస్ తెలుసుకోవడంతో తులసి ఇంకా రాధిక భోజనం పూర్తి చేసి ఇక త్వరగా పడుకుందాం మళ్ళీ ఉదయం లేవాలి కదా అని చెప్పేసి ఇద్దరు కూడా పడుకుంటారు.
ఒకసారి జై బాబు దగ్గరికి వస్తే, శ్యామ్ రాధిక ను దింపేశాక ఎందుకురా ఆ అమ్మాయి మీద అంత కక్ష పెట్టుకున్నవు,
ఆ అమ్మాయి చూస్తే అమ్మాయికి రాల్లాగుంది ఎందుకు అలా సాధిస్తున్న వారి అమ్మాయిని అని అడుగుతాడు.