ఆల్రెడీ ఆయన కి జ్వాల గురించి, తన క్యారెక్టర్ గురించి తెలిసి ఉండడం తో అంత మంచి అమ్మాయి మా ఇంటి కోడలు అయితే బాగుంటుంది…
..
బట్ ఇంత గొప్ప వాడైనా క్రిష్ కి ఆమె ఎందుకు నో చెప్తుందో అర్ధం కాక చాలా సేపు థింక్ చేసి బహుశా క్రిష్ రిచ్ కిడ్ అని తెలిసి మేము ఎక్కడ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోమో అని భయపడి క్రిష్ కి నో చెప్పుంటుంది అని తనకి తోచింది తను అనుకుని ఒకసారి ఆమె తో మాట్లాడి ఆమె భయాలను దూరం చేసి ఇద్దరికీ పెళ్ళి జరిపించాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు….
అలా అనుకున్నప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు అన్నట్టుగా మరుసటి రోజే ఆమెని కలిసి జ్వాల మా అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు.. ఆ విషయం ఆల్రెడీ నీకు తెలుసు..
నాకు కూడా నిన్ననే తెలిసింది… వాడికి నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమో నీకు అర్ధం అవుతుందో లేదో కానీ మాకు మాత్రం బాగా అర్ధమవుతుంది…