ఆ ముఖాన్ని చూడగానే జ్వాల నోటి నుండి మాట రాలేదు. ఐదేళ్లుగా తను రాత్రి పగలు కలలు కన్న ముఖం.. తను ప్రాణంగా ప్రేమించిన తన భర్త ‘శక్తి’ ప్రాణాలతో ఆమె ముందే నిలబడి ఉన్నాడు! వాడు మరింత గంభీరంగా, పవర్‌ఫుల్ గా మారిపోయాడు.
శక్తి జ్వాల వైపు చూసి కళ్లల్లో నీళ్లతో అన్నాడు, “జ్వాలా.. నన్ను క్షమించు. నిన్ను కాపాడటానికే నేను ఇంతకాలం శత్రువుల కంటికి పడకుండా దాక్కున్నాను.”
జ్వాల ఒక్కసారిగా పరిగెత్తుకెళ్లి శక్తి గుండె పై తన చేతులతో బలంగా బాదింది. “ద్రోహి! నన్ను ఐదేళ్లు ఏడిపించావు కదరా!” అంటూ శక్తి ని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. విక్రమ్ కూడా తన సార్ బతికున్నాడనే ఆనందంతో గర్వంగా సెల్యూట్ చేశాడు.
శక్తి ఆలివర్ వైపు తిరిగాడు. “ఆలివర్.. నా జ్వాల జోలికి వస్తే చావు ఎలా ఉంటుందో చూశావు కదా. రేపటి నుండి వాల్ స్ట్రీట్ లో నీ ఎనర్జీ సామ్రాజ్యం ఉండదు.. జేఎస్ సామ్రాజ్యం మాత్రమే ఉంటుంది” అని శక్తి ఆలివర్ ను పోలీసులకు అప్పగించాడు.
ఐదేళ్ల తర్వాత జ్వాల, శక్తిల అపురూపమైన కలయికతో.. అమెరికా మాఫియా ఆలివర్ అంతంతో న్యూయార్క్ నగరం సాక్షిగా జేఎస్ సామ్రాజ్యం విశ్వవ్యాప్తమైంది. కానీ, శక్తి జ్వాల చేయి పట్టుకుని ఒక కొత్త విషయాన్ని చెప్పాడు. “జ్వాలా.. ఆలివర్ దొరికాడు. కానీ మన కంపెనీలోని బోర్డ్ మెంబర్లలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆలివర్ కు మన రహస్యాలన్నీ లీక్ చేశాడు. మన ఇంట్లోనే, మన బోర్డ్ రూమ్ లోనే ఆ బ్లాక్ షీప్ దాగి ఉన్నాడు” అని ఒక భయంకరమైన అంతర్గత ద్రోహం క్లూ ఇచ్చాడు.
న్యూయార్క్ నగరంలో శక్తి బతికే ఉన్నాడనే సంచలన నిజం తెలిసిన తర్వాత జ్వాల జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఐదేళ్ల పాటు గుండెల్లో దాచుకున్న సుదీర్ఘ దుఃఖం, ప్రతీకార జ్వాల.. ఇప్పుడు. తన భర్త బ్రతికే ఉండడం తో అద్భుతమైన నమ్మకంగా రూపాంతరం చెందాయి. కానీ, శక్తి చెప్పిన ఆ ఆఖరి మాట వారిని మళ్లీ అప్రమత్తం చేసింది. అమెరికా ఎనర్జీ కింగ్ ఆలివర్‌కు జేఎస్ కార్పొరేషన్ యొక్క అత్యంత అంతర్గత రహస్యాలను చేరవేసింది బయటి శత్రువులు కాదు.. తాము ఎంతో నమ్మిన, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఉన్న ఒక ముఖ్యమైన ‘బ్లాక్ షీప్’
జ్వాల, శక్తి, మరియు విక్రమ్ ముగ్గురూ అత్యంత రహస్యంగా ప్రైవేట్ జెట్ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చారు. శక్తి బతికే ఉన్నాడనే నిజం సమాజానికి తెలిస్తే ఆ అంతర్గత ద్రోహి అలర్ట్ అయిపోతాడని గ్రహించి, జ్వాల ఒక అద్భుతమైన మైండ్ గేమ్‌కు తెరలేపింది. లోకానికి ఇంకా శక్తి చనిపోయినట్టే లెక్క. జ్వాల మాత్రమే జేఎస్ కార్పొరేషన్ అధినేత్రిగా బోర్డ్ మీటింగ్‌ను లీడ్ చేస్తుంది, శక్తి తెరవెనుక ఉండి విక్రమ్ సహాయంతో ఆ ద్రోహిని పట్టుకోవడానికి వ్యూహం సిద్ధం చేశాడు.
హైదరాబాద్‌లోని జేఎస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని 30వ అంతస్తులో ఉన్న రౌండ్ టేబుల్ బోర్డ్ రూమ్ అది. లండన్ టెండర్ విజయం, అమెరికా ప్రాజెక్ట్ సక్సెస్ తర్వాత జరుగుతున్న మొదటి అత్యంత కీలకమైన అఫీషియల్ బోర్డ్ మీటింగ్. టేబుల్ చుట్టూ కంపెనీలోని టాప్ ఏడుగురు బోర్డ్ మెంబర్స్ కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో జ్వాల సాధించిన విజయాల పట్ల పైకి ప్రశంసలు కనిపిస్తున్నా, లోపల ఒక రకమైన ఆందోళన దాగి ఉంది. చైర్‌పర్సన్ సీట్లో రాయల్ ఎమరాల్డ్ గ్రీన్ శారీ కట్టుకుని, తీక్షణమైన చూపులతో జ్వాల కూర్చుని ఉంది. ఆమె వెనుక ఒక ఇనుప గోడలా విక్రమ్ నిలబడ్డాడు.