క్లాస్ కి వచ్చిన శాన్వికి క్లాస్ లో ఉన్న లెక్చరర్ ఎక్కడికి వెళ్ళావ్? అని సీరియస్ అవుతుంటే మెడికల్ రూమ్ కి వెళ్ళాను అని తన హ్యాండ్ చూపించగానే వాట్ హప్పెండ్ టు యువర్ హ్యాండ్…
బెంచ్ కింద పెన్ పడిపోయిందని తీస్తుండగా రెండు బెంచ్ ల మధ్యలో నలిగిపోయింది సర్ అని సమాధానం ఇవ్వడంతో గో అండ్ సిట్ అన్నారు…
ఏమైంది అన్నట్టుగా కంగారుగా తన స్నేహితులు ఇద్దరు తననే చూస్తుంటే వెళ్లి వాళ్ళ పక్కన కాకుండా మరొక చోట కూర్చుని ఎలాంటి ఆలోచనలు చేయకుండా క్లాస్ వింది కానీ తన హ్యాండ్ కి ఏమైంది బెంచ్ మధ్యలో ఇరుక్కోవడం ఏంటి అని గీత.. కకృతికలు ఆలోచిస్తూ క్లాస్ పై శ్రద్ధ పెట్టలేదు…
క్లాస్ అవ్వగానే వెళ్లి శాను! చేతికి ఏమైందే అని అడుగుతుంటే…. చెప్పా కదే ఇందాక బెంచ్ మధ్య లో నలిగింది అని…