నిజం గానే బెంచ్ మధ్యలో ఇరుక్కుంది అని సమాధానం చెప్పే సరికి చిన్నగా ఉన్నప్పుడు ఏవీ బయటకి చెప్పరు… మేమ్ చూసుకుంటాం లే అనుకుంటారు కానీ ప్రాణం మీదకి వచ్చాక బయటపడతాయి అన్ని ఇలాంటి కేసులే అంటూ ఆవిడ పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ రెడీ చేస్తూ లంచ్ చేశావా ని అడిగింది…
లేదు మేడమ్ పెయిన్ ఎక్కువ అయ్యి హ్యాండ్ అసలు కదలట్లేదు మేడమ్ అంది..
నీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ మేట్స్ హెల్ప్ తీసుకుని ఏమైనా తిను లేదంటే ప్రాబ్లెమ్ అవుతుంది ఇంజక్షన్ వేస్తున్న పది నిమిషాలు ఇక్కడే కూర్చుని వెళ్ళు అంది..
అలాగే మేడమ్ అని ఇంజక్షన్ వేసాక పది నిమిషాలు రెస్ట్ తీసుకోమంది అని అక్కడే కూర్చున్న శాన్వి కి టింగ్ అని నోటిఫికేషన్ మెసేజ్ వచ్చింది…..