ముగ్గురూ విడివిడిగా ఏడుస్తూ పడుకున్నారు.
ఉదయం 8 గంటలు, Day 2 of Fight, అనన్య రూమ్ లోనే ఉంది, రాత్రి నుంచి తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు, కోపంతో, బాధతో..
“నేను తినను, ఈ రాక్షసుడు పెట్టినది తినను, నా అమ్మ, నాన్నని వదిలే వరకు తినను” అనుకుంది.
కింద హాల్ లో రుద్ర కూడా తినలేదు, రాత్రి నుంచి, కోల్డ్ గా కూర్చుని ఉన్నాడు, టేబుల్ మీద ఫుడ్ చల్లారిపోయింది, రాజు వచ్చి “అన్నా, తినండి అన్నా, నిన్న నుంచి ఏం తినలేదు” అన్నాడు.
రుద్ర మొండిగా “No, I will not eat, if she doesn’t eat, I won’t eat” (కాదు, తను తినకపోతే నేను తినను) అన్నాడు..