ప్రేమలో పడితే -24
శ్రీరామ్ మహాలక్ష్మి ఇద్దరినీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి గడ్డం కింద చేతులు పట్టుకొని వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంది రమ్య.
అంటే సార్ అది అని తల వెనక చేతిని పెట్టుకొని “మర్చిపోయాను సార్, అంటే డైలీ వీళ్ళతో పాటు ఇక్కడే కూర్చుని టీం లీడర్ గా వర్క్ చేస్తాను కదా సడన్గా మీకు పిఏ అంటే మర్చిపోయాను సార్” అని పిచ్చి నవ్వు నవ్వుతూ అన్నది మహాలక్ష్మి…
“కం టు మై క్యాబిన్” అని సీరియస్ గా చెప్పి శ్రీరామ్ క్యాబిన్ కి వెళ్ళిపోయాడు..
కం టు మై కాబిన్ అని శ్రీరామ్ ని వెక్కిరిస్తూ అని, ఒసేయ్ ఈ పోస్ట్ నుంచి బయటపడే మార్గం నాకు ఏదైనా చెప్పండి అని గణేష్ రమ్యని అడిగింది.
కానీ రమ్య నవ్వుతూ చూస్తూ ఉండటంతో రమ్య తల మీద కొట్టి ఏంటే నా బాధ నీకు నవ్వుగా అనిపిస్తుందా అలా నవ్వుతున్నావ్ అని చిరు కోపంగా అడిగింది..