నీ మనసు నాకు తెలుసు -7
ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలు….
ఆఫీస్ క్యాబ్ లో సీత కూర్చొని… ఛ ఫస్ట్ డే నే లేట్ అయింది అని అనుకుంటూ….. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది…. ఉదయం జరిగిన సంఘటన గురించి…..
సీత ఆఫీసు కి రెడీ అవుతూ తనలో తను మాట్లాడుకుంటూ… ఈ చీర లో సూపర్ గా ఉన్నవే సీత…. ఎంత అయినా హీరోయిన్ అవ్వచ్చు నువ్వు… అంత బాగున్నావ్ అని తనకి తానే అద్దం లో చూసుకొని ముద్దు పెట్టుకుంటు ఉంది… అప్పుడే గదిలోకి సరోజ వస్తుంది…