నిత్విక్ డోర్ తీయగానే ఎదురు గా ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరు ఎవరు కావాలి అని అడుగుతూ ఉంటాడు… ఆ మాటలని శేఖర్ గారు విని ఎవరు కన్న ఎవరు వచ్చారు అని దగ్గరికి వస్తూ అడుగుతూ ఉంటాడు…..
నిత్విక్ ఏమో నాన్న ఎవరో తెలియదు ముగ్గురు ఉన్నారు ఇద్దరు పెద్దవాళ్ళు ఒక అతను అని చెప్పి చెప్తూ ఉంటాడు…. ఆ మాటలు విని శేఖర్ గారు వచ్చి చూస్తారు…
ఇంక అంతే ఆ వచ్చిన వాళ్ళని చూసి శేఖర్ గారు అలా స్థానువు లా ఉండి పోతారు…. నిత్విక్ నాన్న నాన్న అని కదిపి ఏమైంది నాన్న ఎవరు వాళ్ళు అని అడుగుతాడు… ఆ మాటకి ఆ వచ్చిన వాళ్ళలో ఒక పెద్దాయన… మీ నాన్న ని అడిగితే ఆయన ఏమి చెప్తాడు బాబు నన్ను అడుగు అని చెప్పి మేము లోపలికి రావొచ్చా అని అడుగుతాడు…..