New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమలో పడితే – 23

ప్రేమలో పడితే – 23

ప్రేమలో పడితే -23

 

 

అమ్మ ఏదో మాట్లాడాలి అనుకొని ఏదో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంతకు ముందు కూడా ఎవరో నాలాగా ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని అన్నది. ఎవరు అలా ప్రేమించి వెళ్ళిపోయింది, నేను పుట్టిన తర్వాత నాకు తెలిసి అయితే అలా జరగలేదు మరి అమ్మ ఎవరి గురించి మాట్లాడుతుంది అని ఆలోచనలో పడింది రమ్య. 

 

కంగారు కంగారుగా రూమ్ లోనికి వస్తున్న సావిత్రిని గమనించిన హరినాథ్ సావిత్రి వైపు చూసాడు. ఐదు నిమిషాలు అయినా కూడా సావిత్రి రూమ్ లో చేతులు నలిపేసుకుంటూ కంగారు కంగారుగా తిరుగుతూ ఉండటంతో హరినాథ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకొని ఆపి “ఏమయింది అలా కంగారు పడుతున్నావ్, మరల నాన్న నిన్ను ఏమైనా అన్నారా..?” అని అడిగాడు హరినాథ్..

 

“అది కాదండి నేను మన అమ్మాయి మీద కోపం, కాదు బాధ, కాదు తన జీవితం ఏమైపోతుంది ఏమో అన్న ఆందోళనతో మీ తమ్ముడు గురించి నోరు జారాను’ అని అన్నది సావిత్రి.

 

“తమ్ముడు గురించి నువ్వు మాట్లాడావా..?” అని కళ్ళు చిన్నవి చేసే అడిగారు హరినాథ్. 

 

“అవునండి దాని జీవితం ఏమైపోతుంది ఏమో అన్న కంగారులో మీ తమ్ముడు లాగే తయారవుతున్నావు అని అనేశాను, అదేమో వెంటనే రివర్స్లో నన్ను క్వశ్చన్ చేసింది ఏదో దాన్ని తిట్టేసి వచ్చేసాను. నాకు ఎందుకు చాలా భయంగా ఉందండి అప్పుడు మీ తమ్ముడికి జరిగినట్టే ఇప్పుడు మన కూతురు కూడా ఈ కుటుంబానికి పూర్తిగా దూరమైపోతుంది ఏమో అని నాకు చాలా భయంగా ఉంది. ఇప్పటికీ కూడా ఆ రోజు జరిగిన గొడవ నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మామయ్య ఎదురుగా నిలబడి ఆయన కళ్ళలోనికి చూసి మాట్లాడాలి అంటే నాకు భయమే” అని తన భర్త గుండెల మీద వాలిపోయి అన్నది సావిత్రి..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue