అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారక పడుకుంటది ప్రణతి…. తెల్లవారిద్ది పార్వతి గారు లేచి ఇళ్ళు చిమ్మి బయట కూడా చిమ్మి తుడిచి కల్లాబి చల్లి ముగ్గు పెట్టి తలారా స్నానం చేసి కాఫీ కలిపి ప్రణతి రూమ్ కి వెళ్ళి లేపుతారు పార్వతి గారు…
బెడ్ మీద పడుకొని ఉన్న ప్రణతి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ప్రణతి ని చూస్తూ ఇంక ఎన్ని రోజులు ఇలా కూతురు ఉన్న విషయం కూడా నీకు గుర్తులేదు అక్కడ ఎలా ఉందొ ఏంటో అని ఆలోచించని క్షణం లేదు నా మానవరాలిని చూసుకోవాలని ఆడించుకోవాలని ఎంతో ఆశ గా ఉంది కాని ఎప్పటికి తీరేది అది అని అనుకోని మళ్ళీ ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ప్రను ఇంక లేమ్మా అని లేపుతారు పార్వతి గారు అప్పటి వరకు పడుకొని ఉన్నట్టు గా నటిస్తున్న ప్రణతి ఆ పిలుపు తో ఒక్కసారిగా కోపం గా లేచి….
అమ్మ నన్ను అలా పిలవద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు అలా నాన్న తప్ప ఇంకెవరు పిలిచిన నాకు నచ్చదు అని నీకు తెలుసు కదా అని కోపం గా మాట్లాడిద్ది ఆ మాటకి పార్వతి గారు నవ్వుతు నువ్వు అలా అంటే నే గా లేచేది కోపం తో అయిన అని ముసి ముసి గా నవ్వుతుంటారు పార్వతి గారు…..
అలా చాటు గా నవ్వడం గమనించిన ప్రణతి కోపం గా అఅఅఅఅఅ అని అరిచి వాష్రూమ్ కి వెళ్ళి గట్టిగ డోర్ ని సౌండ్ వచ్చేటట్టు వేస్తది అది చుసిన పార్వతి గారు నవ్వుతు కళ్ళ నీళ్లతో నిన్ను అలా మీ నాన్న ఒక్కడే కాదు ఇంకొకళ్ళు కూడా అలాగే పిలుస్తారు నీకు మీ నాన్న ది మాత్రమే గుర్తుందా….. అని బాధ పడుతు చూస్తుంటారు….
(అక్కడ ఎప్పుడో గుర్తొచ్చిన విషయం తెలియదు పాపం ఎవరికి అంత యాక్ట్ చేస్తుంది మన ప్రణతి)
అలా లోపలికి వెళ్లిన ప్రణతి బాధ తో అలా కేవలం నన్ను నాన్న నిత్తు(నిత్విక్) మాత్రమే పిలవాలి ఇంకెవరు పిలవకూడదు అని బాధ పడుతు కాసేపు అలానే నుంచునిద్ది ఇంక కొంచెం సేపటికి తేరుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిద్ది రెడీ అయ్యి పార్వతి గారు వచ్చి మీ నాన్న కి అక్క కి దీపం వెలిగిచ్చు అని అంటారు….