“అనంతా……!!!!!
మఠత్తిపరంబులోని మనసునే వణికించేలా సుభద్ర గొంతు ప్రతి గోడకీ తగిలి ప్రతిధ్వనించింది.
ముందుకు వేసిన అడుగులు ఒక్క క్షణం నేల మీద గట్టిగా పడలేక తడబడ్డాయి అతనివి…. కానీ మరుక్షణంలోనే తన అడుగుల్ని ముందుకు వేశాడు. అదే సమయంలో ఒక కాలుతో పంచె అంచుని పైకి ఎత్తి, ఎడమ చేత్తో పట్టుకుని, కుడి చేత్తో మడత పెట్టి నడుముకి బిగించుకోవడం కూడా మర్చిపోలేదు….
అతను అలా వస్తుంటే పచ్చదనంతో నిండిన ఆ పచ్చిక బయళ్లు గాలికి ఊగుతూ కదిలాయి….
పెదవుల పైన దట్టంగా ఉన్న మీసాల్ని చూపుడు వేలితో ఒకసారి సవరించుకున్నాడు….
ఎదురుగా ఉగ్రరూపంతో నిలబడి ఉంది సుభద్ర.