New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 18

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 18

సోని కోపంగా వాడి బాధను ఏ మాత్రం పట్టించుకోకుండా కాలిని మెడ మీద నొక్కి పెడుతూ ఏరా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడిన , కొంచెం క్లోజ్ గా ఉన్న, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన,ఎక్కడైనా బయట తిరిగిన ఆ అమ్మాయిని క్యారెక్టర్ లెస్ గా చూస్తారే….

 

మరి అదే ప్లేస్ లో మీ మగాళ్లు ఉంటే మిమ్మల్ని ఏమి అనరెందుకు, అంటే మీరు ఎంత మందితో అయిన తిరగొచ్చా, ఎలాంటి పిచ్చి వేషాలు అయిన వేయొచ్చా….

 

మీ మగాళ్లు తిరిగితే లేని తప్పు మా అమ్మాయిలూ తిరిగితే వస్తుందా అంటూ కోపంతో ఊగిపోతు ఓహో అంటే మేము తిరిగితే మాకు కడుపు వస్తుంది…

 

మీరు ఎంత మందితో తిరిగిన మీకు రాదు అనా అందుకేనా ఆ ధైర్యం తోనేనా మీరు పెళ్ళాం పెళ్ళి కెళ్ళిందనో, పుట్టింటికి వెళ్లిందనో,ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్లిందనో, షాపింగ్ కి వెళ్ళిందనో, పురిటికి వెళ్ళిందనో రావడానికి టైమ్ పడుతుంది అనుకున్న ఆ చిన్న గ్యాప్ నీ కూడా వదలకుండా పక్కన ఆడవాళ్ళని గోకేయడానికి రెడీ గా ఉంటారు….

 

మీకు పెళ్లయిన,పక్కన పెళ్ళాం ఉన్న సరే మీకంటి ముందు అందం గా కనిపించిన ఏ ఆడదాన్ని కామంగా చూడకుండా వదలరు కదా….

 

ఎలాగోలా వాళ్ళని గోకి నాలాగే వాళ్లకి మాయమాటలు చెప్పి లొంగదిసుకుని మీ కోరిక తీర్చుకుంటారు కదా…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue