వెంటనే విన్నీ మాట్లాడుతూ హ్మ్ ఇందుకేగా నిన్ను మాతో రమ్మని చెప్పాను… బట్ నువ్వేమో రాలేదు.. ఇప్పుడేమో మిస్ యూ అంటున్నావు ఏంటి విక్కీ ఇది అంటుంది…
నీకు తెలుసుగా బంగారం నేనేందుకు రానన్నానో.. నిజంగా ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉంది రా… టైమ్ లేదు సో కుదరక రాలేదు….
లేదంటే నేను మాత్రం నిన్ను, బాబుని వదిలి ఉంటానా చెప్పు అంటూ అవన్నీ సరే గాని మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడకి అని అడిగాడు …
ఇంకో ఒన్ ఆర్ టూ హవర్స్ లో బయలుదేరుతాం అని చెప్తుంది వినీల …
ఆ మాట విన్న విక్కీ ఓహ్ అవునా థట్స్ గుడ్… అలా అయితే మీరు డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చేయండి…నేను ఆఫీస్ లోనే ఉన్నాను… అందరం కలిసి ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తాడు…
హ విక్కీ అలాగే… అత్తయ్య పిలుస్తున్నారు బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది విన్నీ ..