నిన్ను ఎప్పటికీ దూరం కానివ్వను… అని భూమి పెదవులు అందుకుంటాడు….
క్రిష్ ప్రేమకి దాసోహం అవుతూ అతని గుండెలపై చేతులను మెల్లగా తీసి జుట్టులోనికి పోనిచ్చి ఆ ముద్దు లో జత కడుతుంది భూమి….
అంతటి ప్రేమ చూపిస్తున్న తన భర్త కి తనని పూర్తిగా అంకితం ఇస్తుంది…
క్రిష్ ఆ రాత్రి అంతా భూమి నీ వదలకుండా జాగారం చేయిస్తాడు… తను లావుగా ఉన్నాను అని ఇబ్బంది పడిన ప్రతీసారి…
అది నాకు ఇబ్బంది కాదు నాకు అదే కంఫర్ట్ అన్న భావన కలిగిస్తాడు క్రిష్…
అలా వారి మధ్య దూరం చెరిగిపోయి ఒక అందమైన భార్య భర్త ల అనుబంధం ఏర్పడుతుంది….