New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మధురమే ఈ హృదయం – 4

మధురమే ఈ హృదయం – 4

సామ్… ఎందుకే అందరూ నన్నిలా టార్చర్ చేస్తున్నారు? నాపాటికి నన్ను వదిలేయచ్చు కదా… అసహనంతో కూడిన బాధ అతడి గొంతులో…

 

 

ప్లీజ్ రా ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టేలా బెహేవ్ చెయ్యను అన్నయ్య. పోనీ నువ్వు ఎక్కడివరకు వెళ్లాలో చెప్పు డ్రాప్ చేస్తాను.అక్కడ వరకైనా నీతో టైమ్ స్పెండ్ చేసానన్న హ్యాపీ ఫీల్ ఇవ్వరా. పాస్ట్ గురించి అసలు టాపిక్ తీసుకురాను…

 

 

ఆమె కళ్ళలోని బాధకు నిట్టూర్చి సరే పద అని కార్ ఎక్కిన సిద్ ని చూసి సంతోషంగా అతని చేతిని చుట్టేసి కూర్చుని ఏవేవో కబుర్లు చెప్తూ ఇంట్లో సంగతులు మాట్లాడుతుంది…

 

 

అతడు అన్నిటికీ ఉ కొట్టి ఊరుకుంటాడు తప్ప మళ్ళీ తిరిగి ఏం మాట్లాడడు…

 

 

అతని ప్రవర్తన ఆమెకి బాధగానే ఉన్న కనీసం అలా అయినా దగ్గరగా ఉన్నందుకు తృప్తి పడుతూ అతని భుజం మీద పడుకుని నిద్రపోతుంది…

 

 

ఆమె తలని నిమిరిన సిద్ హైదరాబాద్ రావడంతో నిద్రపోతున్న సమన్విని అలాగే సీట్ లో వెనక్కి సెట్ చేసి ప్రభాత్ తో ఆమెని ఇంట్లో దించి రమ్మని చెప్పేసి తను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిపోతాడు…

 

 

❤️

 

 

పబ్లిషింగ్ కంపెనీ సీఈఓ ముందు ఆటిట్యూడ్ గా కూర్చున్న సిద్ బుక్ ఎవరూ కంటిన్యూ చెయ్యడానికి వీలు లేదని ఖరాకండిగా చెప్పేస్తాడు…

 

 

సర్, ఆ బుక్ నెక్స్ట్ సిరీస్ కోసం మా కంపెనీకి చాలా మెయిల్స్, రిక్వెస్ట్స్ వస్తున్నాయి.. ఇన్ఫాక్ట్ వార్నింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇది చెయ్యడం మాకు చాలా అవసరం సర్ అని చెప్తాడు ఆ సీఈఓ…

 

 

కుదరదని చెప్పాను కదా…

 

 

థిస్ ఇస్ టూ మచ్ సర్, ప్లీజ్ ట్రై టూ అండర్స్టాండ్ ఔర్ సిట్యుయేషన్ . ఆ రైటర్ కనీసం నా కాల్స్ కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు ప్రెషర్ ఎక్కువ అయిపోతోంది. వీ హావ్ టూ టేక్ సమ్ స్టెప్ అని చెప్తాడు అతడు వివరంగా …

 

 

ఓ క్షణం ఆలోచించిన సిద్ ఓకే మీ బాధలో కూడా న్యాయం ఉంది. ఓ మంత్ లో ఆ రైటర్ ని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. అప్పటివరకు మీరు కామ్ గా ఉండడని చెప్పి నోరు కళ్ళు వదిలేసుకోని మరీ చూస్తున్న ప్రభాత్ ని తీసుకొని కంపెనీ బయటకు వచ్చేస్తాడు…

 

 

ఏం చెప్పావురా ఎలా వాళ్ళకి మోషీని తీసుకు వస్తానని మాటిచ్చావు….

 

 

తెలియదు. కాని కనిపెడతాను…

 

 

చనిపోయిన వ్యక్తిని ఎలా రా కనిపెట్టేది…

 

 

ప్రభాత్ ఊపిరి కోసం సిద్ పిడికిట్లో గింజుకుంటుంటే కళ్ళు తడిచేరి ఎర్రగా అయ్యి అతడి ప్రాణం కళ్ళలోకి వచ్చాక అసహనంగా అతడ్ని వదిలి ఇంత చెప్పినా అది చనిపియిందని వాగుతావ్ ఏంట్రా. ఇంకోసారి అంటే ఊరుకోనని ప్రభాత్ కి సీరియస్ గానే చెప్పిన సిద్ తను బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో ఓ అడ్రెస్స్ చెప్పి ప్రభాత్ ని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్తాడు…

 

 

అతడి ఆలోచనలన్నీ అల్లకల్లోలంగా మారుతుంటే ప్రశాంతత కోసం తను ఎప్పుడూ వెళ్లే ప్లేస్ కి వెళ్లిన అతడు ఆకాశంలో అమావాస్యకు దగ్గర్లో ఉన్న చంద్రుడు సగంసగం కనిపిస్తుంటే ఆమె దరిలేకో లేక ఆ లేక్ లోని నీరు కాస్త పాడయ్యి అతనికి ఆ ప్లేస్ అంతా అస్తవ్యస్తంగా ఉండడమో ఎందుకో అతడికి మనసుకు ఆ రోజు అక్కడి వాతావరణం నచ్చదు.. 

 

 

కానీ అక్కడ నుండి కదల్లేకున్న అతడు ఆకాశంలో నక్షత్రాలని లెక్క పెట్టుకుంటూ తను చెయ్యాల్సింది ఆలోచించుకుంటూ చాలాసేపు అక్కడే తన టైమ్ని స్పెండ్ చేస్తాడు…

 

 

❤️❤️

 

 

నలుగురు రౌడీలు వెనక పడుతుంటే వాళ్ళ నుండి తప్పించుకోను ఓ అమ్మాయి రోడ్డు మీద పరుగు తీస్తుంటే ఆమెని ఎలాగైనా ఆరోజు పట్టుకోవాలని పట్టుదలతో వెంటాడుతున్నారు ఆమెని…

 

 

ఓ పొదల వెనక దాక్కున్న ఆ అమ్మాయి భయంగా గుండె చేతపట్టుకుని కూర్చుంటే అది తనకి నచ్చలేదన్నట్టు ఓ మూడడుగుల పాము ఆమె కాళ్ళ పక్కన్నుండి వెళ్తుంటే ఆ అని గట్టిగా అరుస్తుంది ఆ అమ్మాయి…

 

 

ఒరేయ్! అది అక్కడుందని వాళ్లలో అరవడంతో  ఆమె అరుపుకు కాదు కాని ఆమె కదలికకు అప్పటివరకు స్లోగా పాకే పాము ప్రాణభయంతో  సెరవేగంగా వెళ్ళిపోతుంది అక్కడ నుండి…

 

 

దాన్ని చూసి బిగుసుకుపోయిన ఆ అమ్మాయి తన దగ్గరకు వస్తున్న ఆ రౌడీలని చూసుకునే స్పృహ కూడా ఉండదు. తీరా వచ్చేసరికి ఆమెకు వాళ్ళు అతి సమీపంలో ఉంటారు…

 

 

వెను తిరగాలాని చూసిన ఆమె మొహానికి కట్టుకున్న స్కార్ఫ్ లాగడానికి ట్రై చేస్తున్న అతడి చేతిని తన గోర్లతో రక్కేసి అతడు నోపికి అరుస్తూ కాస్త దూరం జరగడంతో అతడ్ని  వెనక్కి తోసేసి కిండున్న మట్టిని వాళ్ళ మొహాల మీదకి కొట్టి పారిపోతుంది ఆ అమ్మాయి…

 

 

గాలికి అది వాళ్ళ మొహాన్ని లైట్ గా తాకి మిగితాది గాల్లో కలిసిపోవడంతో, త్వరగానే తేరుకున్న వాళ్ళు మళ్ళీ ఆమెను వెంబడించడం మొదలు పెడతారు…

 

 

పరిగెత్తి పరిగెత్తి ఓ ఖాళీ ప్లేస్ లోకి పరిగెత్తిన ఆ అమ్మాయి అంత పెద్ద ప్లేస్ లో చిన్నగా బుజ్జిగా ఉన్న ఓ వుడెన్ ఫినిషింగ్ ఉన్న ఇంటిని చూసి దాని వెనక్కి పరిగెత్తి ఆ ఇంటి గోడకు అనుకుని కాస్త అలుపు తీర్చుకుంటుంది…

 

 

కాసేపు అక్కడే ఎవరికీ కనపడకుండా దాక్కున్న అమ్మాయి అందరూ వెళ్లిపోయారని గ్రహించి చిన్నగా వెళ్లబోతున్న ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది ఆ అమ్మాయి…

 

 

అభి బాకీ హైన్… ❤️