కానీ ఆ సన్నిహితులే అతనికి బాగా తక్కువ ఉన్నారు… వారిలో మొదట ఉండేది ఉజ్వల్…
అతని జీవితం లో ఏం జరిగినా చెప్పుకోవాలనుకునే వ్యక్తి, కొన్ని చెప్పకుండానే తెలుసుకునే వ్యక్తి కూడా ఉజ్వల్ నే…
ఆ గెస్ట్ హౌస్ చుట్టూ ఓ రౌండ్ వేసి… ఎవరైనా తమని ఫాలో అయ్యారేమో అని చెక్ చేసి… ఇంకెవరైనా ఆ ఇంటిని వాచ్ చేస్తున్నారేమో చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక లోపలికి వచ్చి హాల్లో కూర్చొని… ఉజ్వల్ కీ ఫోన్ చేసి… ఉజ్వల్ ఇంటికి వెళ్ళాక హాస్పిటల్ లో జరిగిన విషయాన్నీ చెప్తాడు అనిర్వాణ్…