New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 86

పెళ్లి చూపులు – 86

పెళ్లిచూపులు-86

 

 

అబ్బా ఈడు నన్ను ఇరికించేసాడు కదా, అయినా ఇప్పుడు నా భార్య ఇలాంటి కొత్త ట్విస్ట్ ఇస్తుంది అని నేను అసలు ఊహించలేదు అని అనుకుంటూ తన భార్య కొడుకు ఇద్దరు వైపు చూస్తూ ఉన్నారు విజయేంద్ర.

 

“ఏంటండీ మన కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్తే నేను యాక్సెప్ట్ చెయ్యను గయ్యాలనని వాడికి చెప్పారా ఏంటి..?” అని నడుమీద రెండు చేతులు పెట్టుకొని సీరియస్గా అడిగింది వరూధిని..

 

ఇది మరీ బాగుంది అటు తిరిగి ఇటు తిరిగి నా మీద పడుతున్నారు అని మనసులో అనుకొని “వాడు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు కదా అందుకే చెప్పలేదు కానీ ఇలా నీకు తెలిసిన నువ్వు అడుగుతావు అని నేను ఊహించలేదు” అని సమాధానం చెప్పారు విజయేంద్ర..

 

“నిజం చెప్పండి డాడీ, ఇలా అమ్మ పెళ్లిచూపులు ప్లాన్ చేస్తుంది అని మీకు ముందే తెలిసి కావాలి అని నా చేత నిజం బయటికి రప్పించాలి అని మీరు సైలెంట్ గా ఉన్నారు కదా” అని అడిగాడు వైష్ణవ్ 

 

“రేయ్ మీ అమ్మ ఇలా నువ్వు వచ్చేంతవరకు పెళ్లి చూపులకు వెళ్తున్నాం అని నీకు చెప్పేంతవరకు కూడా నాకు తెలియనే తెలియదు. మీ అమ్మ మాట కాదు అంటే ఇంకేమైనా ఉందా, అందుకే తను పెళ్లి చూపులకు వెళ్దాం అంటే నేను ఓకే చెప్పాను అంతకుమించి నాకేమీ తెలియదు. ఇప్పటివరకు నువ్వు నా పార్టీ కానీ నీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నీ పెళ్ళికి ఒకే చెప్పేసరికి ఇప్పుడు నువ్వు మీ అమ్మ పార్టీ అయిపోయావా దుర్మార్గుడా..?” అని అన్నాడు విజయేంద్ర..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue