మనస💞వాచా – 4
చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధమే లేనట్టు తనలో తానే తగలబడి పోతున్న మేఘ జడ్జ్ మీదే కళ్ళు నిలిపి.. ఇంకా డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. అతని నుంచి నాకు వీలైనంత త్వరగా విడాకులు ఇప్పించండి అని చెప్పింది.
మేఘ ఆన్సర్ తప్ప అర్జున్ చెవులకు ఇంకా ఏది వినిపించలేదు.
పగబట్టిన నిశ్శబ్దాన్ని చీల్చినట్టు.. నాకు ఇష్టమే అని ఒకటే ఆన్సర్ ఇచ్చాడు అర్జున్.
ఇద్దరి యొక్క అభిప్రాయం మీద జడ్జ్ గారు ఇద్దరి వైపు ఉన్న లాయర్స్ తో మాట్లాడి నెక్స్ట్ మంత్ కి హియరింగ్ డేట్ అనౌన్స్ చేశారు.
అది వింటున్న అర్జున్ మేఘ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు.
మనసుని కొండంత మౌనం మింగేస్తున్న ఇద్దరి కళ్ళు లోతుగా దేని కోసమొ వెతుకుతున్నాయి.
మెఘా, వెళ్లాలి అని చిన్నగా చెప్పాడు రిత్విక్.
అర్జున్ మీద నుంచి కోపంగా కళ్ళు తిప్పి లాయర్ గా తన పక్కనే నిలబడ్డా రిత్విక్ చేయి పట్టుకొని నువ్వు చెప్పింది నిజం బావ, నేను మాత్రమే ప్రేమించాను.. అని కన్నీళ్లు పెట్టుకున్న మేఘ భుజం చుట్టి చంపేసేలా అర్జున్ ను చూస్తూ తనని కోర్టు నుంచి బయటికి తీసుకువెళ్లాడు రిత్విక్.
పెద్ద పెద్ద బూడిద మేఘాలు ఒకదాని తర్వాత ఒకటి వరుస కట్టి వేగంగా పరుగులు పెడుతున్నాయి ఆకాశంలో. ఆ పరుగులకి సాయంగా దుమ్ములే పుకుంటూ వేగంగా సుడులు తిరుగుతుంది గాలి.
స్టెప్స్ దిగడమే దుమ్ముతో వచ్చిన గాలి చుట్టేయడంతో కళ్లకు చెయ్యి అడ్డుపెట్టుకొని నిలబడిపోయింది మేఘ.
ఏయ్ మేఘ చూసుకో అంటూనే రివర్స్ తీస్తున్న కార్ తన వరకు వచ్చేలోపే భుజం పట్టి వెనక్కి తప్పించాడు రిత్విక్.
వాళ్ల వెనకే స్టెప్స్ స్టార్టింగ్ లో ఉన్న అర్జున్.. ఆర్ యు ఆల్ రైట్, కళ్ళల్లో డస్ట్ పడిందా..?? అని అడుగుతున్న రిత్విక్ కేరింగ్ కి ఇట్స్ ఓకే బావ, ఏం లేదు అని చెప్తున్నా ఇద్దరి ముందుకి వచ్చి ఒక్క క్షణం అలా చూసి కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఏం మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న అర్జున్ బిహేవియర్ కి.. ఎందుకు ఇలా చేస్తున్నావ్..?? అని ప్రశ్నించుకున్న మేఘ కళ్ళల్లో మళ్ళీ వెచ్చగా కన్నీళ్లు సుడులు తిరిగి చెంపల మీదకి జారుతున్నాయి.
నువ్వు వాడికి ప్రియారిటి ఇచ్చి బాధపడడం కరెక్ట్ గా లేదు. లీవ్ ఇట్.. ఐ విల్ బి విత్ యు. ఇప్పుడు నువ్వు చెప్పేసావ్ కదా, ఇక మిగిలింది నేను చూసుకుంటాను అని కన్సోల్ చేస్తూ కార్ దగ్గరికి తీసుకొచ్చాడు రిత్విక్.
వాళ్ల కార్ కి రెండు కార్ లా అవతల తన కార్ దగ్గర నిలబడ్డాడు అర్జున్.
ఊగిపోతున్న చెట్ల నుంచి అక్షింతల మాదిరి రాలుతున్నాయి రంగు మారిన ఆకులు.
తల మీద పడ్డ ఆకుని వేళ్ళతో తీసి మేఘ వైపుకి విసిరి వాళ్ళిద్దరిని చూస్తూ పాకెట్ లో నుంచి సిగరెట్ పెదవుల మధ్య నిలిపి లైట్ చేశాడు అర్జున్.
అంతే కన్నీళ్ల స్థానంలో కోపం పొంగుకొచ్చి ఎర్రబడింది మేఘ ముఖం.
ఫస్ట్ పఫ్ పూర్తిగా గుండెల్లోకి తీసుకునే లోపే విసురుగా అర్జున్ మీదకు వచ్చి అతని వేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్ ని లాగి విసిరేసిన మేఘ అంతే కోపంగా గూబాకు పెట్టి పీకింది.
తన ఫాస్ట్ రియాక్షన్ కి ఫ్రీజ్ అయిపోయిన రిత్విక్ కి మైండ్ బ్లాక్ అయింది. మేఘ స్టెప్ అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
గొంతులోకి తీసుకున్న పొగ మేఘ మొఖం మీదకి ఊదుతూ కనుబొమ్మలు ముడివేసిన కోపంతో పాకెట్స్ లో హాండ్స్ దోపాడు అర్జున్.
అతని కోపానికి ముక్కుతోనే సెగలు కక్కుతూ చూపుడువేలు చూపిస్తున్న మేఘ కార్ నెక్స్ట్ సైడ్ నుంచి పాపని ఎత్తుకొని దిగిన ధాత్రి ని చూడడమే తన కోపంతో పాటు, అర్జున్ నుంచి అడుగు కూడా వెనక్కి తీసుకుంది.
ఆ డిస్టెన్స్ నీ కళ్ళతోనే స్కాన్ చేస్తున్న అర్జున్ పెదవుల మీద అప్పుడు ఒక సన్నని నవ్వు వచ్చి చేరింది.
దానిలోని అర్థం ఎదురుగా ఉన్న మేఘ కే తెలియాలి.
హాయ్ మేఘ.. అని చిన్న గొంతుకతో పలకరించిన ధాత్రి మీద నుంచి చూపు అర్జున్ మీదకి తిప్పింది మేఘ అతని రెస్పాన్స్ కోసం.
ధాత్రి ని చూడడమే మేఘ దగ్గరికి వచ్చేసిన రిత్విక్ తన చేతిని స్మూత్ గా హోల్డ్ చేస్తూ వెళ్దాం అన్నాడు అర్జున్ ని నిలదీస్తున్న చూపులతో.
ఇద్దరినీ దాటి వెనక్కి తిరిగి చూసినా అర్జున్ కళ్ళతోనే ఏమిటని అడిగితే.. వెదర్ చేంజ్ అయింది, రైన్ స్టార్ట్ అయితే ట్రాఫిక్ లో ఇరుక్కుపోతం అని నెమ్మదిగా తన షోల్డర్స్ మీద నిద్రపోతున్న పాపని ఒత్తి పట్టుకుని వెంటనే స్టార్ట్ అవుదాం.. అని చెప్తూనే ఇబ్బందిగా మేఘ ను చూస్తుంటే
నువ్వు లోపల కూర్చో, ఇక్కడ ప్రశ్నించే వాళ్లే తప్ప మన అవసరం ఉన్నా వాళ్లు ఎవరూ లేరు.. వెళ్లిపోదాం అని తన సైడ్ కి వచ్చిన అర్జున్ డోర్ ఓపెన్ చేసి పట్టుకోవడంతో మేఘ ను చూస్తూనే పాపని మరింత భద్రంగా గుండెలకి హత్తుకుంటూ లోపల కూర్చుంది దాత్రి.
అరిచేతితో గుండెని బిగించనట్టు విలవిలలాడిపోతున్న మేఘ కళ్ళు కన్నీళ్ళతో దారకట్టయి.
ప్లీజ్ డోంట్ క్రై, నువ్వు ఎంత ఏడిస్తే వాడు అంత ఎక్కువ చేస్తున్నాడు.. అని రిత్విక్ కన్సోల్ చేస్తూనే ఉన్నా తనని తోసుకుంటూ కారు దగ్గరికి వెళ్లి పోయిన మేఘ.. ఇక్కడ ఎవరి కోసం టైం అండ్ ఎమోషన్స్ వేస్ట్ చేసుకోవలసిన అవసరం నాకు లేదు. నువ్వు వస్తున్నావా లేదా..?? అని అరిచింది.
ππππππππππππππππππππππππππππππππππ
కామెంట్స్ మస్ట్ బేబీస్.
Thank You
__వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages