ఇద్దరి అరుపులు రూమ్ దాటి బయటికి వినిపిస్తుంటే టెన్షన్ పడిపోతూ డోర్ కొడుతున్నాడు విష్ణు.
సరిగ్గా అదే టైం లో వచ్చిన జితేంద్ర, రూపా గారు ఇంకా రిత్విక్ బయట విష్ణు చేస్తున్నది లోపలి నుంచి వినిపిస్తున్న అరుపులకు విపరీతమైన కోపంతో ముందు విష్ణు ని పక్కకు లాగేసి డోర్ ఓపెన్ చేయమని గట్టి గట్టిగ తలుపు భాదేస్తున్నారు.
అర్జున్ నీవల్ల నా కూతురికి చిన్న హాని కలిగిన నిన్ను వదలను. మర్యాదగా డోర్ ఓపెన్ చెయ్.. అని అరుస్తున్న జితేంద్ర గొంతు లోపల వరకు వినిపిస్తుంది.