ప్రణయ్ వితిన్ సెకండ్స్ లొ రియాక్ట్ అయి ప్రతిమని సేవ చేసిన విధానం భరత్ కి కూడా చాలా ముచ్చటగా అనిపించడంతో నువ్వు చాలా డెవలప్ అయ్యావు బావమరిది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం చిన్న స్మైల్ ఇచ్చి అబ్బో ఈమాత్రం అయితే మేము కూడా చేస్తాంలే..
భార్య కింద పడిపోతుంటే పట్టుకోవడం గొప్పకాదు మామ.. భార్యను అసలు కింద పడిపోకుండా చూసుకోవడం గొప్ప..
ఆమెకు ఎలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం గొప్ప.. అంతేకానీ పడిపోతున్న భార్యకు చెయ్యందించడం కాదు..
అసలు మీ అబ్బాయే మా అమ్మాయిని పైకి ఎక్కించి ఉంటే మా అమ్మాయికి అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా..
ఆ విషయం మీకు మీ అబ్బాయికి తెలియలేదే మామ అంటు సాగదీస్తూ అంటాడు భరత్..
అబ్బో అల్లుడుగారు ఎందులో తగ్గేలా లేరుగా అసలు..
ఇన్ని రోజులు నవ్వుతూ అన్ని పనులు చేస్తూ ఉంటే చాలా అమాయకుడివి అనుకున్నాను అబ్బాయ్… నీలో అల్లరి వాడు కూడా ఉన్నాడు సుమీ..