మరుసటి రోజు ఉదయం పది గంటలు. అన్విక నిన్న రాత్రి రణ్వీర్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లోని డ్రెస్‌ను అయిష్టంగానే వేసుకుంది.
అద్దంలో తనను తాను చూసుకుంటే, ఒక అందమైన ఖైదీలా అనిపించింది. రణ్వీర్ బిజినెస్ మీటింగ్‌లో ఉన్నాడని తెలిసి ఆమెకు కొంచెం ధైర్యం వచ్చింది.
శ్రీనివాసరావు గారు, వాసవి, అన్నపూర్ణమ్మ అందరూ సిద్ధమయ్యారు. దేవి గారు తన లగ్జరీ కారులో వారి ఇంటికి వచ్చి, అందరినీ తీసుకుని సిటీలోనే అత్యంత ఖరీదైన మాల్ కి బయలుదేరారు.
అనిత కి ఇంకా రాహుల్ కి ఆ రోజు ఎగ్జామ్ ఉండటంతో ఇద్దరం కూడా షాపింగ్ కి రావడం కుదరదని ముందే చెప్పేయడంతో వీళ్లు మాత్రమే వెళ్తారు.
అక్కడ మాల్‌కి కొంచెం దూరంలో ఒక పాత భవనంలో జగ్గర్ తన మనుషులతో సమావేశమయ్యాడు.
రేయ్ రణ్వీర్ ఆఫీస్‌లో ఇంటర్నేషనల్ డీల్‌లో బిజీగా ఉన్నాడు. ఇదే సరైన సమయం. ఆ శ్రీనివాసరావు గాడిని అందరి ముందు భయపెట్టండి.