షాపింగ్ మాల్ లో అన్విక తన తండ్రితో కలిసి ఒకవైపు బట్టలు చూస్తోంది, మరోవైపు ఆమె మనసు నిలకడగా లేదు.
తన చుట్టూ ఏదో అదృశ్య నీడ తిరుగుతోందని ఆమెకు తెలుసు. రణ్వీర్ ఆఫీస్‌లో ఉన్నానని చెప్పినా, అతని కళ్లు తనను వెంబడిస్తున్నాయని ఆమె సిక్స్త్ సెన్స్ చెప్తోంది.
అన్విక చేతిలో ఒక పట్టుచీర పట్టుకుని ఉండగా ఆమె ఫోన్ మోగింది. అది రణ్వీర్.ఏం చేస్తున్నావు అన్వికా ఆ పట్టుచీర నీకు అస్సలు బాగోదు,దాన్ని పక్కన పడేసి..
నీ వెనుక ఉన్న ఆ రెడ్ కలర్ లాంగ్ గౌన్ తీసుకో అది నా అన్వికకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నాడు రణ్వీర్ ఫోన్ లో,అన్విక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది.
అక్కడ ఎవరూ లేరు. మీరు మీరు నన్ను ఎలా చూడగలుగుతున్నారు,మీరు ఆఫీస్ లో లేరా అని వణుకుతున్న గొంతుతో అడిగింది.
నేను ఎక్కడ ఉన్నా న కనురెప్పల నీ వెనుకే ఉంటాయి అన్వికా. ఒక్కసారి నీ రైట్ సైడ్ ఉన్న ఆ గ్లాస్ ఎలివేటర్ వైపు చూడు అన్నాడు రణ్వీర్.