నెల రోజుల మౌనం తర్వాత ప్యాలెస్‌లో మళ్ళీ నవ్వులు వినిపిస్తున్నాయి. అన్విక మళ్ళీ పాత అన్వికలా మారిపోయింది.
కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుండి ఆమె ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తోంది.
రణ్వీర్ తన మాట విని స్వేచ్ఛని ఇచ్చినందుకు ఆమె మనసులో అతని మీద గౌరవం, ప్రేమ రెండూ పెరిగాయి.
కాలేజీలో అన్విక, అనిత, శ్రావణి మరియు రాహుల్ అందరూ కలిసి ఒక గ్యాంగ్‌లా తిరుగుతున్నారు. అన్విక ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంది.
జూనియర్స్‌ను సరదాగా ర్యాగింగ్ చేయడం, క్లాసుల మధ్యలో క్యాంటీన్‌కు వెళ్లి కబుర్లు చెప్పుకోవడం.. ఇలా ఆమె కాలేజీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.
ఇంటికి వచ్చాక కూడా అన్విక రణ్వీర్తో చాలా చొరవగా ఉంటోంది. గతంలో ఉన్న భయం పోయి, ఇప్పుడు రణ్వీర్ భుజం మీద తల వాల్చి రోజంతా జరిగిన విషయాలు చెబుతోంది.