నందు మాట్లాడుతూ…”ఇదొక పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పడం కష్టం కానీ నువ్వు ముందు ఇది చెప్పు మీ అన్నయ్య ఎందుకు ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు!!??”అని అడుగుతుంది…
ఇంతలో మెయిడ్ వచ్చి “అమ్మగారు వంట ఏం చేయమంటారు!?”అని అడుగుతుంది…
కన్నా నవ్వుతూ…”నాకు మాత్రం బిర్యానీ చెయ్!”అని అంటాడు…
మెయిడ్ నోటి మీద చెయ్యి వేసుకుని…”కానీ పెద్ద బాబు గారికి తెలిస్తే తిడతారు చిన్న బాబు గారు మీరు బయటకు తినద్దని చెప్పారు అలానే ఎక్కువ మసాలా ఉన్నది కూడా చదువుకునే పిల్లలకు మంచిది కాదు అని చెప్పారు కదా!”అని అంటుంది..
కన్నా మాట్లాడుతూ “అయినా అన్నయ్యకెలా తెలుస్తుంది తినేస్తే అయిపోతుంది కదా!”అని అంటాడు…
నందు మాట్లాడుతూ “సరే అయితే నేనే చెప్తున్నాను కన్నా… ఏది అడిగితే అది చేయాలి ఈరోజు కన్నా కి ట్రీట్ ఇద్దాం!!”అని అంటుంది…