వద్దన్నా వదిలేస్తానా @20
“చూసావా జనా…వీళ్లు నీ కొడుకుకి మందు తాగించి, కూతుర్ని వాడిని రూమ్లో వదిలేసారురా..!! స్నేహం పేరుతో వీళ్ళు చేస్తున్న పని ఏంటో ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు..!! ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళ లేకి బుద్ది..?? ఛీ.. ఛీ.. మొన్నే కదా ఇది పైట వేసింది.. అప్పుడే.. “
“భానుమతి గారు … ఇంకొక మాట నా కూతురు గురించి తప్పుగా మాట్లాడిన కానీ పెద్ద దానివి అని కూడా మర్చిపోవాల్సి వస్తుంది.!” ఆవేశంగా ముందుగా వచ్చాడు మహీధర్.
“రేయ్.. ఏం చేస్తావ్ రా ఏం చేస్తావ్..? కొడతావా మా అమ్మనీ..? అయినా మా అమ్మ చెప్పిందాంట్లో తప్పేముంది నిజమే కదా..!!
ఇంతకుముందే కదా నేను ఇక్కడికి వచ్చింది అప్పుడు అడిగాను విరాట్ వచ్చాడా అని..? ఏం చెప్పారు మీరు..?? “ అన్నాడు మహీధర్.